పెళ్లిలో విజయ్ - రష్మిక ధరించిన నగల విలువ అన్ని కోట్లా?
టాలీవుడ్‌లో అభిమానులు ఎంతో ఇష్టపడే జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ క్రమంలోనే ముఖ్యంగా వారి వస్త్రాలంకరణ, ఆభరణాలు, పెళ్లి సెటప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.
రాయల్ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్..
ఈ పెళ్లిలో విజయ్-రష్మికలు ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రాయల్ వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ Anamika Khanna రూపొందించినట్లు సమాచారం. సంప్రదాయాన్ని ఆధునిక స్టైల్‌తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ డిజైన్స్ జంట అందాన్ని మరింత రెట్టింపు చేశాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చేతి పనితో చేసిన ఎంబ్రాయిడరీ, ప్రత్యేక ఫాబ్రిక్ ఎంపిక, మరియు కస్టమ్ కలర్ ప్యాలెట్ ఈ దుస్తులకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

కోట్ల విలువైన నగలు ప్రధాన ఆకర్షణ..
అంతే కాకుండా ఈ వివాహంలో జంట ధరించిన నగలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జువెలరీ సంస్థ దాదాపు 10 నెలల పాటు శ్రమించి ఈ నగలను రూపొందించినట్లు సమాచారం. రష్మిక ధరించిన వడ్డాణం, మంగళసూత్రం, హారం, గాజులు సహా మొత్తం 11 రకాల నగల బరువు సుమారు 1.5-2 కేజీలు ఉండగా, వాటి విలువ రూ.3-5 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం. మరోవైపు విజయ్ ధరించిన అరకేజీ బరువైన నగల విలువ రూ.1-2 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం.
ఇక విజయ్ తెలుగు సంప్రదాయాలను, రష్మిక కూర్గ్‌లోని కొడవ వలస వారసత్వాన్ని కలిపి.. ఈ వివాహాన్ని రెండు విభిన్న సాంస్కృతిక గుర్తింపుల అందమైన సమ్మేళనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది. విజయ్-రష్మిక జంటపై ఇప్పటికే ఉన్న క్రేజ్ కారణంగా ఈ పెళ్లి వార్తలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఈ ఫొటోలను షేర్ చేస్తూ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications