Bigg Boss 9 : హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ అవుట్.. 4 వారాలకు ఎంత సంపాదించాడంటే..?
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌లో మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ఆడియన్స్ అంచనాలు భారీగా ఉండేవి. 'అగ్నిపరీక్ష' షోలో ఆయన పట్టుదల, దూకుడు చూసి, టాప్ 5 కు చేరే అర్హత ఉన్న బలమైన కంటెస్టెంట్‌గా అంతా భావించారు. కానీ, హౌస్‌లో ఆయన ప్రయాణం మాత్రం ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గట్టుగా సాగలేదు.
హరీష్ మొదటి నుంచీ తనకు తానుగా ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, ప్రతీ చిన్న విషయానికి హౌస్ మేట్స్‌తో గొడవ పడడం, ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా మూలన కూర్చొని ఉండడం - ఈ అలవాట్లు ఆయనకు పెద్ద మైనస్‌గా మారాయి. ఒకరిద్దరితో గొడవపడితే అనుకోవచ్చు, కానీ రోజులు తరబడి మిగతా కంటెస్టెంట్స్‌ను దూరం పెట్టే ఆయన మనస్తత్వం ఆడియన్స్ దృష్టిలో ఆయన్ను పూర్తిగా డౌన్ చేసింది. నిజానికి, హరీష్ ప్రవర్తన చూస్తుంటే, ఆయనకు కూడా 'ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి' అనే భావన బలంగా ఉన్నట్లు అనిపించింది. అందుకే, ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఆయన మనస్తత్వానికి అస్సలు సూట్ కాలేదు అనేది విశ్లేషకుల ఏకాభిప్రాయం.

టాస్క్‌ల విషయానికి వస్తే, 'అగ్నిపరీక్ష'లో ఫుల్ స్కోప్ దొరికినట్లుగా, బిగ్ బాస్‌లో హరీష్‌కు ఆశించిన స్థాయిలో ఛాన్స్ దొరకలేదనే చెప్పాలి. అయితే, ఛాన్స్ వచ్చినప్పుడల్లా హరీష్ తన పట్టుదలను చూపించేవాడు. కానీ ఈ వారం, టాస్క్ మధ్యలో దెబ్బలు తగలడం వల్ల ఆయన డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మొత్తంగా, ఈ వారం స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా దొరకకపోవడం ఆయన ఎలిమినేషన్‌కు కారణంగా నిలిచింది.
ఇక, రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. హరీష్‌కు వారానికి దాదాపు రూ. 80,000 చొప్పున పారితోషికం లభించిందని అంచనా. నాలుగు వారాలు హౌస్‌లో కొనసాగినందుకు గానూ, ఆయన సుమారుగా రూ. 3 లక్షల 20 వేలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నట్లు తెలుస్తోంది. సామాన్యుల కేటగిరీలో ఎక్కువ రోజులు ఉన్నందుకు ఇది పర్వాలేదనే చెప్పాలి.












Click it and Unblock the Notifications