నీలకంఠ మూవీ రివ్యూ..జూనియర్ విజయ్ హిట్టు కొట్టాడా?

చిత్ర పరిశ్రమలోకి మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. బాల నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన "నీలకంఠ" అనే పీరియాడిక్ రూరల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్స్ గా నటించారు.

అలానే నటి స్నేహ ఉల్లాల్ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శ్రీను వంటి నటులు ఇతర పాత్రలు పోషించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాసులు, వేణుగోపాల్ ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించారు. నేడు (జనవరి 2, 2025) పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. అయితే రిలీజ్ కి ఒక రోజు ముందుగానే సినిమాకి ప్రిమియిర్స్ ప్రదర్శించారు మేకర్స్ మరి సినిమా ఎలా ఉంది?

master-mahendran-nilakanta-movie-review-and-rating-in-telugu

సినిమా కథ..

సరస్వతిపురం అనే ఒక గ్రామంలో కట్టుబాట్లను బాగా ఫాలో అవుతారు. ఆ గ్రామ పెద్దగా రాఘవయ్యా( రాంకీ) ఉంటారు. అదే ఊరులో టైలర్ గా నాగ భూషణం ( కంచరపాలెం రాజు), అతని కొడుకు నీలకంఠ( మాస్టర్ మహేంద్రన్ ) ఉంటారు. నీలకంఠ బాగా చదివే వాడు కానీ 10వ తరగతిలో ఒక తప్పు చేస్తే 15 సంవత్సరాలు ఊరు నుంచి బయటికి పోకుండా ఉండాలని.. ఇకపై చదువుకోకూడదని శిక్ష విధిస్తారు. ఆ సమయంలోనే సర్పంచ్ ( పుధ్వీ) కూతురు.. సీత (యష్ణ ముతులూరి) అనే అమ్మాయిని నీలకంఠ ఇష్టపడతాడు. ఆ తర్వాత ఆమె పై చదువుల కోసం బయటికి వెళ్ళిపోవడం.. ఈ గ్యాప్ లోనే నీలకంఠ కబడ్డీలో రాణిస్తాడు. కానీ ఊరు దాటి వెళ్లలేకపోతాడు. ఇక 15 ఏళ్ల తర్వాత సీత తిరిగి రావడం.. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం నీలకంఠ ఒక ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. చివరికి నీలకంఠ అనుకున్న పని సాధిస్తాడా ? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేది తెరపై చూడాల్సిందే..?

మూవీ విశ్లేషణ..

ఇప్పటి వరకు తెలుగు తెరపై ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. హీరో ఛాలెంజ్ చేయడం .. చివరికి దానిని సాధించడం.. మరీ ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప లో ఊరి పెద్ద నిర్ణయాలు చూసే ఉంటాం. కానీ ఆ మూవీస్ కి దీనికి ఒక పాయింట్ కొత్తగా ఉంది. ఇప్పటి వరకు మనం అన్ని సినిమాల్లో తప్పు చేస్తే ఊరు నుంచి వెలివేయడం చూశాం కానీ ఈ కధలో ఊరు నుంచి బయటికి పోకుండా ఆ తప్పు చేసిన వాడికి ఇష్టమైంది దూరం చేయడం అన్నది కొత్త పాయింట్. అంతే కాకుండా ఈ కధ నాన్ లినియర్ స్క్రీన్ ప్లే తో మొదలు అవుతుంది. ఈ మూవీ లో ఎమోషనల్ సీన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాల బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎమోషనల్ జర్నీ, లవ్ ఎపిసోడ్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అంతా చాలా రేసీగా ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా కొత్తగా డిజైన్ చేసారు. ఊరులో కబడ్డీ, చివరి 30 నిముషాలు స్టోరీలో హైలైట్ గా నిలిచాయి.

master-mahendran-nilakanta-movie-review-and-rating-in-telugu

నటీనటులు & సాంకేతిక విభాగం పనితీరు..

మెయిన్ లీడ్ గా చేసిన మాస్టర్ మహేంద్రన్ చాలా సెటిల్డ్ గా పెర్ఫర్మ్ చేసాడు. తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎక్స్ పీరియన్స్ నటుడిలాగా పర్ఫామెన్స్ అదరగొట్టాడు.

యష్నా సీత పాత్రలో చాలా సహజంగా నటించింది.

స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్ తో చేసింది.

రాంకీ చాలా రోజుల మళ్లీ స్క్రీన్ మీద మెప్పించారు.

రాకేష్ మాధవన్ డైరెక్షన్, రైటింగ్ లో విజయం సాధించాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఒక కొత్త దర్శకుడు ఇంత పెద్ద పాడింగ్ ఆర్టిస్టుని హేండిల్ చేసిన విదానం బాగుంది.

మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ వింటేజ్ ఫీలింగ్ కలిగించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అని చెప్పాలి.

రేటింగ్..

3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+