మోక్షజ్ఞ సరసన మెగా హీరోయిన్‌ ఖరారు?

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా అద్భుతంగా దూసుకువెళుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ సింగ్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన ఆయన డాకూ మహారాజ్ సూపర్ హిట్ తో డబుల్ హ్యాట్రిక్ కు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 చేస్తున్నారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే మొన్నటివరకు అన్ స్టాపబుల్ షో చేశారు. దీంతోపాటు తన తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బాలయ్య తన కొడుకును స్టార్ హీరోగా తీర్చిదిద్దాలంటే తొలి సినిమాగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో వర్మ
ప్రశాంత్ వర్మతో సినిమా అని వార్తలు వచ్చినప్పటికీ అతను డబ్బులు భారీగా డిమాండ్ చేశాడని, తన అసిస్టెంట్ తో సినిమా చేయిస్తానని, తాను దర్శకత్వం వహించనని, కథను మాత్రమే ఇస్తానని... ఇలా అనేక రకాలుగా వ్యవహరించడంతో అతనిపై బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రెండు పీకినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకొని త్వరలోనే సెట్స్ పైకి అడుగుపెట్టబోతోంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం వహించనున్నారని, బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడాలనే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు.

Meenakshi Chowdhury confirmed as heroine in nandamuri Mokshagna movie

ఆమె అయితే మోక్షజ్ఞ సరసన బాగుంటుందంటున్నారు
మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే శ్రీలీల వద్దని, మీనాక్షి చౌదరి అయితే బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకుందని, తను మోక్షజ్ఞ సరసన హీరోయిన్ అయితే వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. చాలామంది అభిమానులు మాత్రం హీరోయిన్ గా మీనాక్షి చౌదరినే ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండో సినిమాను కూడా బాలయ్య సిద్ధం చేసివుంచారు. అయితే దర్శకుడెవరనేది ఖరారు కాలేదు. వెంకీ అట్లూరి లేదంటే మాస్ సినిమా చేయించాలనుకుంటే బోయపాటి శ్రీనుతో చేయించే అవకాశం ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+