అమ్మా క్షమించు.. మెగా డాటర్ నిహారిక వీడియో వైరల్ !

మెగా డాటర్ "నిహారిక కొణిదెల" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటగా షార్ట్‌ ఫిల్మ్స్ ద్వారా తన ప్రతిభను నిరూపించింది. ముద్దపప్పు అవకాయ సహా పలు షార్ట్ ఫిల్మ్స్ నటించి యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా యాంకర్‌గా ఆకట్టుకుని తెలుగు ప్రజలకు మరింత చేరువైంది. కాగా యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చేసిన "ఒక మనసు" సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత సూర్యకాంతంతో పాటు తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్, మద్రాస్‌కారన్ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అలానే మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఓ చిన్న పాత్రలో కూడా మెరిసింది. ఆశించిన స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు రాకపోవడంతో హీరోయిన్ గా కొంచెం గ్యాప్ ఇచ్చింది.

mega-daughter-niharika-video-goes-viral-on-social-media

నిర్మాతగా విజయం..

నటిగా విజయాలు రాకపోయినా.. నిర్మాతగా మాత్రం నిహారిక మంచి సక్సెస్ లను అందుకుంటుంది. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.. వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తుంది. డెడ్‌లైన్, కమిటీ కుర్రోళ్లు వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించింది. కమిటీ కుర్రోళ్లు బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు.. ఆమెకు "బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు" కూడా అందించింది.

అలానే ఆమె నిర్మించిన చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్‌లు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం తన ప్రొడక్షన్ లో రెండో సినిమాపై దృష్టి పెట్టింది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

అమ్మా క్షమించు..

అటు సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గానే ఉంటుంది నిహారిక. స్నేహితులతో కలిసి ట్రిప్స్ చేస్తూ, తరచుగా ఫోటోలు షేర్ చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా జలపాతం వద్ద తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి క్యాప్షన్‌గా.. మా అమ్మ నేను క్షేమంగా రావాలని ప్రార్థనలు చేస్తుంటే.. నేనేమో జలపాతం వద్ద తడుస్తున్నా.. సారీ అమ్మ" అని రాసింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తన వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది.

మరోవైపు వ్యక్తిగతంగా నిహారిక జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని, మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల నుంచి దూరంగా ఉన్నా, విడాకుల తర్వాత తన తల్లిదండ్రులతో నివసిస్తూ మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు నటనతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+