మెగా డాటర్ సుస్మిత ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? చిరు, పవన్ కాదట..!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంత మంది ఉంటారు అంటే లెక్కపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే కోట్ల మంది అభిమానులు ఆయన్ను దైవంలా భావిస్తారు. అన్నయ్య అని ప్రేమగా పిలుచుకుంటారు. తన డ్యాన్స్, నటనతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు చిరంజీవి. ఏడు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా చలాకీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఖాతాలో మరో హిట్ పక్కా అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించడం విశేషం. తండ్రి సినిమా కావడంతో అన్నీ ఆమె దగ్గరుండి చూసుకున్నారు.
అయితే మెగా డాటర్ సుస్మిత కొణిదెలకు ఫేవరెట్ హీరో ఎవరు అంటే..? ఎవరైనా చిరంజీవి అనే చెప్తారు. కానీ ఆమె ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును.. సినిమాల్లో తనకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఆసక్తికర సమాధానంగా చెప్పారు సుస్మిత. చిరు, పవన్ పేర్లను కామన్ గానే చెబుతారు.. కానీ బయట హీరోల్లో ఎవరు ఫేవరేట్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్పారు సుస్మిత. చిన్నప్పట్నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామని అన్నారు. రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని, తన ఫేవరేట్ హీరో అని మెగా డాటర్ సుస్మిత చెప్పారు.

ఇక తాజాగా 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యు /ఏ సర్టిఫికేట్ ను అందించారు సెన్సార్ అధికారులు. ఇక సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12 న విడుదల కానుంది. ఇక ఇందులో విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications