ప్రకాష్ రాజ్‌ను బ్యాన్ చేసిన మెగా ఫ్యామిలీ..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.తిరుమల లడ్డూ వివాదంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.పవన్ కల్యాణ్ ఒక్కసారి మాత్రమే ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేశారు. లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రకాష్ రాజ్ ఇప్పటికీ ఆయన మీద ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్'' అంటూ తమిళ హీరో కార్తీ చేత క్షమాపణలు చెప్పించడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు.

''గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం అంటూ మరోసారి పవన్‌పై ప్రకాష్ రాజ్ సైటెర్స్ వేశారు. ఇక ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను రాజకీయాల్లో "ఫుట్‌బాల్"‌తో పోల్చారు. పవన్ కల్యాణ్‌‌ను వాడుకొని రాజకీయ ప్రయోజనాలు సాధించుకుంటారని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ వంటి పార్టీల ప్రభావానికి అతను లోనవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయ నేతల కన్నా ఎక్కువగా ప్రకాష్ రాజ్ టార్గెట్ చేయడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mega Family has decided not to cast Prakash Raj in movies

ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీ కూడా ప్రకాష్ రాజ్ తీరుపై గుర్రుగా ఉంది. నిర్మాత నట్టి కుమార్ పవన్ కల్యాణ్‌ను విమర్శించే అర్హత ప్రకాష్ రాజ్‌కు లేదని తెలిపారు. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ కూడా ప్రకాష్ రాజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక మీదట మెగా హీరోలు నటించే సినిమాల్లో ప్రకాష్ రాజ్‌ను తీసుకోకూడదనే నిర్ణయానికి మెగా ఫ్యామిలీ వచ్చినట్టు సమాచారం. పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్‌ చేసిన వ్యాఖ్యల కారణంగానే మెగా ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+