పవన్ కల్యాణ్ కోసం రామ్ చరణ్ ప్రచారం?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చిరంజీవి అన్నా, చిరంజీవి కుటుంబ సభ్యులన్నా అందరికీ గౌరవం. మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన తనయుడు రామ్ చరణ్ అప్పట్లో ఒక పాట పాడారు అనే వార్త ఇప్పుడు వైరలవుతోంది. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలోనూ అడుగు పెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో ప్రమోషన్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కొన్ని పాటలు సింగర్స్ చేత పాడించారు .
వాటిల్లో రామ్ చరణ్ కూడా పాట పాడడం అప్పట్లో హైలైట్ గా మారింది . చిరంజీవి కి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుండటాడు రామ్ చరణ్. అలాగే ప్రజారాజ్యం పార్టీకోసం తనవంతు కృషి చేశారు . నాన్న పార్టీ కోసం చెర్రీ పాట పాడటం మంచి పని అని చెబుతూ ఈ విషయాన్ని మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కోసం కూడా రామ్ చరణ్ ఒక పాట పాడితే బాగుంటుందని, ఎన్నికల్లో జనసేనకు ఎంతో సహాయకారి అవుతుందని మెగా అభిమానులు అంటున్నారు. మరి రామ్ చరణ్ జనసేన కోసం ముందుకు వస్తాడో? రాడో? చూద్దాం.

పవన్ కల్యాణ్ కోసం రామ్ చరణ్ లోపాయికారీగా సహకారం అందిస్తున్నాడని, తనవంతుగా నేరుగా కాకపోయినా పరోక్షంగా సాయం చేస్తున్నాడని, అలా కాకుండా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగి ప్రచారం చేయడం లేదంటే పిఠాపురం నియోజకవర్గం వరకు పవన్ కోసం ప్రచారం చేసినా ఆ ప్రభావం రాష్ట్రమంతటా జనసేన పోటీచేస్తున్న నియోజకవర్గాలపై పడుతుందని, ఎన్నికలకు అది ఉపయోగపడుతుందని, అభిమానులంతా ఓట్లు వేస్తే జనసేన పార్టీ అభ్యర్థులంతా సులువుగా విజయం సాధిస్తారని అంటున్నారు. రామ్ చరణ్ ఏం చేస్తాడో చూడాలి మరి.












Click it and Unblock the Notifications