రామ్‌చరణ్ కొత్త కారు ఎన్ని రూ.కోట్లో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే తనకు సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేశారు. దీనితర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం కోడి రామ్మూర్తినాయుడి జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారంటున్నారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అనంత్ అంబానీ పెళ్లికి..
అనంత్ అంబానీ పెళ్లికి రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. తన సతీమణి ఉపాసనతో కలిసి వెళ్లాడు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన రామ్ చరణ్ రోల్స్ రాయిస్ లగ్జరీ కారులో దిగుతున్న ఫొటోలు వైరలయ్యారు. ప్రస్తుతం ఈ కారు గురించి, ఈ కారులో నుంచి దిగుతున్న రామ్ చరణ్ గురించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ మొత్తం మీద ఈ కారును కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి రామ్ చరణ్ అని తెలుస్తోంది. జనవరిలో దీని మోడల్ విడుదలవగా వెంటనే చెర్రీ దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఖరీదు రూ.7.5 కోట్లు
ఈ కారు ఖరీదు రూ.7.5 కోట్లుగా ఉంది. రామ్ చరణ్ అంత ఖరీదైన కారును కొనుగోలు చేయడంలో తప్పులేదని మెగా అభిమానులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా రూ.కోట్లలో ఉంటోందని, పాన్ ఇండియా స్థాయి నుంచి గ్లోబల్ హీరో స్థాయికి రామ్ చరణ్ చేరాడంటున్నారు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ మంచి మార్కెట్ ను ఏర్పరుచుకుంటున్నాడు. శంకర్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన భారతీయుడు2 సినిమా ఘోర పరాజయం పాలైంది. దీంతో మెగా అభిమానులు గేమ్ ఛేంజర్ గురించి ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications