అల్లు అర్జున్ తో రామ్ చరణ్ విషయమై మాట్లాడిన చిరంజీవి

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలైంది. అగ్ర కథానాయకుడిగా నాలుగు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తన సినీ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు.. ఎన్నో అవార్డులు.. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు.. వేరే కథానాయకులు తనతో పోటీపడుతున్నప్పటికీ అగ్ర స్థానాన్ని కొనసాగించుకోవడానికి వయసు ఎంత వచ్చినా కష్టపడుతుండటమే ఆయనకు తెలిసింది. మీకు అర్థమయ్యేవుంటుంది ఆయనెవరనేది.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానరుపై వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మే 9న విడుదల కాబోతోంది.

చేస్తాడంటావా బన్నీ?
మెగాస్టార్ పుత్రరత్నం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. చిన్నతనం నుంచి చాలా రిజర్వుడుగా ఉండేవాడు. ఎవరితోనైనా మాట్లాడాలంటే మొహమాటపడేవాడు. మాట్లాడటానికి తనంతట తానుగా ముందుకు వచ్చేవాడు కాదు. ఇటువంటి లక్షణాలున్న కుర్రవాణ్ని హీరోగా చేస్తున్నామంటే ఎలా? సినిమాల్లో అందరిముందు నటనను ప్రదర్శించాలి.. నృత్యాలు చేయాలి.. పోరాటాలు చేయాలి.. చేస్తాడంటావా? అంటూ అల్లు అర్జున్ తో చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడారు.

mega star Chiranjeevi spoke to Allu Arjun about his son Ram Charan

మీకేం అనుమానం అక్కర్లేదు
మామయ్యా.. మీరేం అనుమానం పెట్టుకోవద్దు.. చరణ్ బ్రహ్మాండంగా రాణిస్తాడు.. నువ్వు అసలు ఇబ్బంది పడొద్దు అంటూ అల్లు అర్జున్ చిరంజీవికి ధైర్యాన్నిచ్చారు. చివరకు మగధీర, ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో 16వ సినిమాను, సుకుమార్ దర్శకత్వంలో 17వ సినిమాను చేస్తున్నాడు. మెగా అభిమానులందరికీ తన హీరో కుమారుడు కూడా స్టార్ హీరో అవడం, అందులోను పాన్ ఇండియా హీరో అవడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా పుష్ప2 చేస్తున్నారు. ప్రత్యేక గీతం షూటింగ్ ఒకటే మిగిలివుంది. మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+