చిరు- వెంకీ స్టెప్స్ అదుర్స్.. మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రవిపూడి కాంబోలో వస్తున్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'.. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించడంతో దీనిపై మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ రిలీజ్ అయింది.

డిసెంబర్ 31 నేపథ్యంలో ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సాంగ్ లో చిరంజీవి, వెంకటేశ్ స్టెప్స్ ఫ్యాన్స్ ను విజిల్స్ వేయిస్తున్నాయి. బాసూ అంటూ వెంకటేశ్.. చిరంజీవి క్రేజ్ ను చెబుతుంటే.. చంటి అంటూ మెగాస్టార్.. వెంకీ మామ క్రేజ్ ను వివరిస్తున్నారు. దాంతో ఈ సాంగ్ ఇన్ స్టాంట్ గా జనాల్లోకి వెళ్లింది. ఏంటీ బాసూ సంగతి.. అద్దిరిపోద్దీ సంక్రాంతి.. అంటూ సాగే ఈ సాంగ్ న్యూ ఇయర్ వైబ్ ను తీసుకొస్తుంది. ఈ సాంగ్ లోని క్యాచీ లిరిక్స్ ను కాసర్ల శ్యామ్ రాశారు.

Mega Victory Mass Song Released Chiranjeevi and Venkatesh Set the Screen on Fire with Epic Dance Moves

ఇక ఈ మూవీ జనవరి 12 న విడుదలకు సిద్ధం అయింది. దర్శకుడు అనిల్ రావిపూడి మునుపటి హిట్స్ అయిన 'ఎఫ్2', 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరిగానే ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరోవైపు ఈ సారి సంక్రాంతికి భారీగానే సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న హారర్ కామెడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 9 న విడుదలకు సిద్ధం అవుతోంది.

అలాగే మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు.. అలాగే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ మూవీ రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా జన నాయగన్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దాంతో ఈ సారి పోటీ గట్టిగానే ఉండబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+