చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య!
మెగాస్టార్ చిరంజీవికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఊహించని షాక్ ఇచ్చారు. ఎందుకిచ్చారు? వివరాలేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ముందు అసలు ఆ షాక్ చిరుకు ఎందుకు తగిలింది? అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్, శోభన, సంయుక్త మీనన్, ఒకప్పటి హీరోయిన్ లయ కూతురు శ్లోక తదితరులు నటిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలనుకున్నారు.
తక్కువ సమయంలో అనిల్ రావిపూడి తీసేస్తాడు
అయితే షూటింగ్ పూర్తికాకపోవడంతోపాటు వీఎఫ్ ఎక్స్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. దసరాకు సినిమా రావడం కష్టం కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి పనిచేసేవారితో చిన్న వీడియోను రూపొందించి ఇటీవలే విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో సినిమాను తీయడం అనిల్ రావిపూడికి అలవాటు కాబట్టి ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు.

థియేటర్ల కొరత రాకుండా చూసుకోవాలి
దీంతో అనుకోకుండా బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ తలపడబోతున్నారు. 2023 సంక్రాంతికి కూడా వీరిద్దరూ సంక్రాంతికి తలపడి.. ఇద్దరూ విజేతలుగా నిలిచారు. చిరు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చి విజయాలను అందుకున్నారు. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత 2026 సంక్రాంతికి బాలయ్య, చిరు హోరాహోరీగా తలపడబోతున్నారు. ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడుతున్నారంటే థియేటర్ల కొరత ఉంటుంది. ఆ కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై, డిస్ట్రిబ్యూటర్లపై ఉంటుంది. అప్పుడే అభిమానుల మధ్య గొడవలు జరగకుండా ఉంటాలి. లేదంటే తమ హీరోకు తక్కువ థియేటర్లు ఇచ్చారంటూ ఒకర్నొకరు ఆరోపించుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాలపై నిర్మాతలు ముందుగా దృష్టిపెట్టాలని సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications