చిరంజీవి 156 సినిమాలు చేస్తే పవన్ కల్యాణ్ కు నచ్చింది ఒకే ఒక్క సినిమా!!

మెగాస్టార్ చిరంజీవి అనే పేరు తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషిచేస్తోంది. క్యారెక్టర్ నటుడిగా, ప్రతి నాయకుడిగా పరిశ్రమలోకి ప్రవేశించి తర్వాత సుప్రీంహీరో అయ్యారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయారు. మెగాస్టార్ అనేది ఆయన ఇంటిపేరు అయిపోయింది. తన నృత్యాలు, పోరాటాలతో ఎంతోమంది అభిమానులు ఆకట్టుకొని తెలుగులోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లగా, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. తమ్ముడి కొడుకు, చెల్లెలి కొడుకు, అల్లు కుటుంబం.. ఇలా అందరూ కలిపి 8 వరకు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

కేవలం ఒక్క సినిమానే నచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుంది
పవన్ కల్యాణ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తర్వాత జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చిరంజీవి విశ్వంభర చిత్రంతో కలిపి 156 సినిమాలు చేశారు. తన 157వ సినిమాగా అనిల్ రావిపూడితో చేయబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రణాళికతో ఉన్నారు. అయితే చిరంజీవితోపాటు సినిమా షూటింగ్ లకు వెళ్లే పవన్ కల్యాణ్ తర్వాత నెమ్మదిగా తాను కూడా సినిమాల్లో నటించి పవర్ స్టార్ అయ్యారు. తన అన్న చిరు సినిమాలన్నింటిలో తనకు నచ్చింది ఒకే ఒక సినిమా అంటే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.

megastar Chiranjeevi did 156 films but Pawan Kalyan liked only one film

చిరు అనగానే మనకు గుర్తుకొచ్చే మొదటి సినిమా
చిరంజీవి అనగానే మనకు గుర్తుకొచ్చే మొదటి సినిమా ఖైదీ. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది. సంచలన విజయం సాధినంచిన ఈ సినిమా అంటే పవన్ కల్యాణ్ కు బాగా ఇష్టం. ఈ తరహాలోనే ఓ సినిమా చేయాలని అనుకున్నారుకానీ కథ కుదరకపోవడంతో విరమించుకున్నారు. అటవీ నేపథ్యంలో ఓ సినిమా చేయాలని పవన్ కు ఇప్పటికీ ఉంది. కానీ భవిష్యత్తులో కూడా అది కుదిరేపనిలా అనిపించడంలేదంటున్నారు అభిమానులు. ఇప్పటికే పవన్ చేయాల్సిన సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది. అవి ఎప్పటికి పూర్తవుతాయో పవన్ కల్యాణ్ కే తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+