మెగాస్టార్ చిరంజీవి దేవుడు.. రెండు కోట్లు సాయం చేశారంటున్న ప్రముఖ యాంకర్

సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి అనడంలో అతిశయోక్తి కాదు. టాలీవుడ్ లో పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వరకు ఎందరికో మెగాస్టార్ సాయం చేశారు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు హెల్త్ కిట్స్ వ్యాక్సిన్స్ పంపిణీ చేశారు. ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు. చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతోన్నారు. సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

తాజాగా ఒక కార్యక్రమంలో యాంకర్ రోషన్ సైతం చిరంజీవి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి ఓ సినిమా ప్రమోషన్స్ తర్వాత ఒక సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా అంటూ నన్ను ఇంటికి పిలిపించారు. నా దృష్టిలో ఆయన ఒక గొప్ప దేవుడు... అంతా బిజీ షెడ్యూల్ లో కూడా సమయం కేటాయిస్తారు అని తెలిపారు. అంతే కాకుండా తన పుట్టిన రోజున కేక్ కూడా కట్ చేయించారని రోషన్ చెప్పారు.

Megastar Chiranjeevi is God helped me with two crores - anchor roshan

ఇక అన్నయ్య చాలా మందికి సహాయం చేయాలి అని నేను చెప్పడంతో ఆయన రెండు కోట్ల రూపాయల చెక్కులు నాకు పంపించారని రోషన్ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి 10 జన్మలెత్తిన తమ్ముడు గానే నేను పుట్టాలని ఎమోషనల్ అయ్యారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+