'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్.. ఇది కదా చిరంజీవి సినిమా అంటే..!
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ను ఈరోజు తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడితోపాటు చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో చిరంజీవి తన కామెడీ టైమిగ్ తో అలరించారు. చిరంజీవి చాలా స్టైలిష్ గా ఉన్నారు. వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నయనతార- చిరంజీవి మధ్య వచ్చే సీన్స్ చాలా సరదాగా ఉన్నాయి. చివరిలో వెంకటేశ్- చిరంజీవి ఫేస్ ఆఫ్ చాలా బాగుంది. మొత్తానికి ట్రైలర్ మెగాస్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిందని చెప్పాలి.

ఇక ట్రైలర్ లాంచ్ తర్వాత వరుసగా 9 రోజుల పాటు నాన్ స్టాప్ ప్రమోషన్ టూర్ ప్రారంభించనుంది చిత్ర యూనిట్. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కవర్ చేస్తూ నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్, బెంగళూరులో ఈ టూర్ కొనసాగనుంది. ఇప్పటికే రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. అలాగే ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్రలో నటించారు. అలా సినిమాలో ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కు సిద్ధమైంది. దాంతో ఈ సారి బాక్సాఫీస్ వద్ద పోటీ గట్టిగానే ఉండనుంది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications