'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను తిరస్కరించిన స్టార్ హీరో

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈనెల 14వ తేదీన విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. కామెడీ సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. దీన్నిబట్టి ప్రజలకు హాస్యంతో కూడిన సినిమాలంటే ఎంత ఆసక్తో అర్థమవుతోంది. వెంకటేష్ కెరీర్ లో నే తొలిసారిగా మొదటిరోజు రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, బుల్లిరాజు (పవన్ సాయి సుభాష్) తదితరులు నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. గేమ్ ఛేంజర్ సినిమా కూడా దిల్ రాజుదే.

కేవలం 72 రోజుల్లో సినిమా పూర్తి
అనిల్ రావిపూడి మొదటగా ఈ సినిమా కథను చిరంజీవికి వినిపించారు. ఆ సమయంలో వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. అనిల్ రావిపూడితో సినిమా అంటే తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చు. ఆ అవకాశం ఉన్నప్పటికీ ఎందుకనో చిరంజీవితో చేయడం కుదర్లేదు. చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాను మెగాస్టార్ చేసివుంటే ఇంకో రేంజ్ లో ఉండేదంటున్నారు. చివరకు ఈ కథను అనిల్ వెంకీకి చెప్పి ఓకే చేయించుకున్నాడు. కేవలం 72 రోజుల్లో సినిమా షూటింగ్ ను పూర్తిచేసి రికార్డు సృష్టించారు. అనవసరమైన వృథాను అరికడుతూ కేవలం 10 నుంచి 15 నిముషాల్లోపే ఉన్న సీన్లనే తీసేశారు.

megastar chiranjeevi rejected sankranthiki vasthunnam movie

ఇంతవరకు అనిల్ ఫ్లాప్ ఇవ్వలేదు
చిరంజీవి అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాతగా ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ముందు పట్టాలెక్కుతుందా? లేదంటే అనిల్ రావిపూడితో తీయబోయే సినిమా పట్టాలెక్కుతుందా? అనేది తేలాలి. అనిల్ ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సెకండాఫ్ కాస్తంత సాగదీసినప్పటికీ ఆ సమయంలో వెంకీ తన కామెడీ యాక్షన్ తో బోరు కొట్టకుండా చూశాడు. అలాగే వెంకీ కొడుకుగా నటించిన బుల్లిరాజు నటనకు కూడా అందరూ ఫిదా అయ్యారు. హాయిగా నవ్వుకున్నారు. ప్రజలు హాయిగా, మనసారా నవ్వుకునే సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు లభిస్తున్న ఆదరణను బట్టి అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+