ఎప్పటికీ వాటి జోలికి వెళ్లనంటున్న మెగాస్టార్ చిరంజీవి...

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాజకీయాలకు నేను దూరం అయినా కానీ.. నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు అంటూ ఆయన సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అయితే ఇప్పుడు చిరు పొలిటికల్ గా ఏం మాట్లాడిన కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆయన మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఇదే విషయంపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. కళామ్మతల్లి సేవలోనే ఉంటానంటూ కుండ బద్దలు కొట్టారు. దీంతో మరోసారి కీరు రాజకీయాల వ్యవహారం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది.

లక్ష్యాలను తమ్ముడు పవన్ నెరవేరుస్తాడు..

హస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'బ్రహ్మా ఆనందం'. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కి కానున్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో తాను కొందరు పెద్ద నేతలను కలుస్తుండటంతో పలువురికి కొత్త అనుమానాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి.. పెద్ద పెద్ద వాళ్లకు దగ్గరవుతున్నాడు.. అటు వైపు వెళ్తాడా అని... ఇటు వైపు వెళ్తాడా అనే డౌట్ వద్దు అని క్లారిటీ ఇచ్చారు.

megastar Chiranjeevi shockintg comments on political entry

తన జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు చోటు లేదని మెగాస్టార్ తేల్చి చెప్పేశారు. ఇకపై సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తాను ఎంత మంది పెద్దలను కలిసినా సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమేనని స్పష్టం చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చెప్పారు.

అంతకు ముందు..

ఇక అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి.. విశ్వక్ సేన్ 'లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని.. ఇక అంతా జనసేనే అంటూ చెప్పారు. అలానే జై జనసేన అంటూ నినాదం చేయడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో చిరు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మళ్లీ చిరంజీవి రియాక్ట్ అయ్యి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అనిల్ రావిపూడితో మూవీ..

ఇప్పటికే ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. మరోసారి ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. పాలిటిక్స్‌కి వెళ్లిన తర్వాత చాలా ఒత్తిడి అనుభవించాను. నా పరిస్థితి చూసి సురేఖ ఏంటండి మీరు నవ్వడమే మానేశారు అనేది. అప్పుడు ఒక్కటే అనిపించేది. నాలో హాస్యగ్రంధులు దొబ్బేసేయా అని. కానీ తిరిగి సినిమాల్లోకి వచ్చాక నాలో ఆ ఫన్ మళ్లీ వచ్చింది. ఇక అనిల్ రావిపూడి సినిమా స్టోరీ లైన్ విన్నాక మళ్లీ పూర్తిగా హాస్య గ్రంథులు వచ్చేస్తాయి అనే నమ్మకం కలిగిందని తెలిపారు. అనిల్ తో కాంబినేషన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+