మెగాస్టార్ "విశ్వంభర" స్టోరీ ఇదే.. రివీల్ చేసేసిన వశిష్ట !
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల 'వాల్తేరు వీరయ్య'తో మంచి హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా 'విశ్వంభర'చిత్రంలో నటిస్తున్నారు.
'బింబిసార'తో తనకంటూ ప్రత్యేక గుర్తింప తెచ్చుకున్న వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం.. విజువల్ వండర్ గా ప్రేక్షకుల్ని అలరించడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రస్తుతం చిత్రం ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే vfx కారణంగా సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని అనుకుంటున్నారు. కాగా ఈ సినిమా కథను దర్శకుడు విశిష్ట రివీల్ చేసారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మూవీ ఎలా ఉండబోతుందో అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే..
మనకు తెలిసినట్లుగా మొత్తం 14 లోకాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడింది. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు.. అయితే వాటి పైన అన్బన్ మరో లోకమే సత్యలోకం. దాన్నే విశ్వంభరగా అభివర్ణించారు. ఆ లోకంలో ఉన్న కథానాయికను వెతుకుతూ హీరో 14 లోకాలను దాటి ఎలా వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను భూమికి తీసుకొచ్చే ప్రయాణమే ఈ సినిమా స్టోరీ అని చెప్పుకొచ్చారు.
ఈ స్టోరీ చిరంజీవి గతంలో నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' గుర్తు చేస్తుంది. అయితే అక్కడ కథానాయిక స్వర్గలోకం నుంచి భూమికి వస్తే.. ఇక్కడ హీరో ఆమె కోసం విశ్వంభర లోకానికి ప్రయాణం అవుతున్నారు. ఈ రెండు కథలూ పోలినట్లు కనిపించినా, తన కథ ప్రత్యేకమైనదేనని దర్శకుడు వశిష్ఠ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'కీలు గుర్రం', ఎన్టీఆర్ నటించిన 'పాతాళభైరవి' లాంటి ఫాంటసీ చిత్రాల నుంచి ప్రేరణ తీసుకున్నానని ఆయన చెప్పారు.
మరోవైపు మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుండగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. నయనతార, కేథరిన్ కథానాయికలుగా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
-
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications