మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ ఇదే: చాలా పవర్ ‌ఫుల్‌గా ఉందండోయ్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం.. విశ్వంభర. ఆయన నటిస్తోన్న 156వ సినిమా ఇది. మైథలాజికల్- అడ్వెంచర్‌‌గా తెరకెక్కుతోంది. మల్లిడి వశిష్ట దర్శకుడు. వశిష్ట ఇదివరకు నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన బింబిసారకు దర్శకత్వం వహించాడు. తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు.

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మాతలు వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫాంటసీ మూవీపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విడుదల అయిన మెగా 156 కాన్సెప్ట్ పోస్టర్‌ అప్పట్లో సంచలనం రేపింది.

 Megastar Chiranjeevis latest movie Viswambhara title concept was released

అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం.. ఇలా పంచ భూతాలను ఒకే పోస్టర్‌లో చూపించేశారు నిర్మాతలు. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. ఈ సినిమాకు విశ్వంభర అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇదే టైటిల్‌ను ఖాయం చేశారు.

టైటిల్ టీజర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కొద్ది సేపటి కిందటే విడుదల చేసింది. నిమిషం 16 సెకెండ్ల నిడివి ఉన్న ఈ టీజర్.. చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ అంజిని తలపించింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ అద్దిరిపోయాయనిపించింది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనేది దీని ట్యాగ్ లైన్.


ఈ టైటిల్ కూడా సినిమా కాన్సెప్ట్‌పై ఉత్కంఠతను రేకెత్తించింది. భోళాశంకర్ డిజాస్టర్ తరువాత మెగాస్టార్ నటిస్తోన్న సినిమా కావడం, అప్పుడెప్పుడో అంజి తరువాత అలాంటి జోనర్‌లో మళ్లీ చిరంజీవి నటిస్తోండటం వల్ల దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+