2026 లో ఫస్ట్ హిట్ సినిమా ఇదేనా..?
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ముందుకు వెళ్తోంది. విడుదలైన 5 రోజుల్లోనే రూ.226 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. బుక్ మై షో లో ఈ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుక్ మైషోలో ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవగా.. అత్యంత వేగంగా ఆ ఘనతను అందుకున్న తొలి రీజనల్ మూవీగా చిరంజీవి సినిమా నిలిచింది.
ఈ ఏడాది సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విడుదలైన 5 రోజుల్లోనే రూ.226 కోట్లకుపైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం విశేషం. దాంతో ఈ ఏడాది ఫస్ట్ హిట్టు బొమ్మ ఇదేనంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించారు. అభినవ్ గొమఠం, శరత్ సక్సేనా, కేథరిన్, శ్రీనివాస రెడ్డి, బుల్లిరాజు ఫేమ్ మాస్టర్ రేవంత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.
అటు నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఈ సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.41.20 కోట్లు వసూలు చేసిందీ మూవీ. కంప్లీట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ కథను హీరో నవీనే రాయడం విశేషం. ఇందులో ఆయన జమీందారు మనవడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను నవ్వించారు. నవీన్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించారు. రావు రమేశ్, చమ్మక్ చంద్ర, మహేశ్, మాస్టర్ రేవంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అలాగే హీరో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదలైంది. సామజవరగమనా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ అబ్బూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి కూడా క్లీన్ సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి రోజు అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైందీ చిత్రం. ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ పెరగడంతో అన్ని ప్రాంతాల్లోనూ షోస్ బాగా పెరగడం వల్ల.. మంచి కలెక్షన్స్ ను నమోదు చేసింది.
-
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications