భార్య పుట్టినరోజున మెగాస్టార్ ఎమోషన్ పోస్ట్...
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వయసులో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
మెగాస్టార్‌కి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో, సోషల్‌మీడియాలో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఫ్యామిలీ విషయాలన్నీఅభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మారింది. ఇంతకీ ఆయన ఏ విషయం గురించి పోస్ట్ వేశారో తెలుసుకుందాం రండి.. చిరంజీవి భార్య సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సురేఖ.

ఆమె గురించి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చాలాసందర్భాల్లో సురేఖ గురించి చెప్పడం చూశాం. ఇక, అంతకంటే ఎక్కువగా పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కూడా ఆమె గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. సురేఖ తనకి రెండో అమ్మ అంటూ పవర్‌స్టార్ చాలా సందర్భాల్లో చెప్పడం మనం చూశాం. ఇప్పడు ఈ ప్రస్తావనంతా ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ రోజు ఫిబ్రవరి 18. మెగాస్టార్ చిరంజీవి జీవిత భాగస్వామి సురేఖ పుట్టినరోజు. ఈ ప్రత్యేకమైన రోజున తన జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ వేశారు.
నా జీవితానికి గ్రేటెస్ట్ పిల్లర్ తనే...
నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ.. అంటూ కవిత్వం రాస్తూ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌మీడియాలో తనఖాతాలో ఇలా రాశారు. "నా జీవిత భాగస్వామి, నా జీవితానికి గ్రేటెస్ట్ పిల్లర్ అయిన సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు తన భార్యతో కలసి ఉన్న ఓ ఫోటోని కూడా చిరంజీవి షేర్ చేశారు. ఇక ఈ పోస్టు చూసిన మెగా ఫ్యాన్స్‌కు సురేఖకు శుభాకాంక్షలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications