గుడ్ న్యూస్ చెప్పిన మెగా హీరోయిన్..అతనితో ఉన్న ఫొటో షేర్ చేసేసిందిగా..!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఒకరు. ''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు.
"మహానుభావుడు,"రాజా ది గ్రేట్," "F2", "F3" వంటి సూపర్ హిట్ సినిమాలు మెహ్రీన్ ఖాతాలో ఉన్నాయి. అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రష్మిక, పూజా హెగ్డె వంటి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో మెహ్రీన్‌ను దర్శక-నిర్మాతలు పక్కన పెట్టేశారు. దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇదిలా ఉంటే భవ్య బిష్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ప్రేమయాణం సాగించింది.

భవ్య బిష్టోయ్ తాత మాజీ సీఎం కావడం ఇక్కడ మరో విశేషం. మెహ్రీన్ తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు కానీ. అతనితో వివాహాన్ని రద్దు చేసుకుని అందరికి షాకిచ్చింది. కారణం తెలపకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటించింది. ఇదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహ్రీన్ ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయాయి. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా మెహ్రీన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సెగల్ ఈ పెయింటింగ్ వేశారు. దీంతో మా ప్రయాణం మొదలైంది. మమ్మల్ని ఆకృతి చేసిన క్షణాల నుండి పుట్టింది. ప్రతి బ్రష్‌స్ట్రోక్ ఒక కథను చెబుతుంది. మనం ఇక్కడికి ఎలా చేరుకున్నాము. ఈ మాయా నగరానికి అనేది తెలియజేస్తోంది. ప్రతి మలుపు, ప్రతి నిశ్శబ్ద విజయం మనం కలలుగన్న జీవితానికి దగ్గర చేసింది. ఇది కేవలం కళ కాదు-ఇది మనం. అది మనం జీవించిన, ప్రేమించిన, కలిసి ఉన్న ప్రతి దాన్ని ఎప్పటికీ కలిగి ఉంటుంది'' అనే క్యాప్షన్ జత చేసింది.
"మా ప్రయాణ చిత్రలేఖనం - @artbysehgal చే సృష్టించబడింది, కానీ మమ్మల్ని తీర్చిదిద్దిన క్షణాల నుండి పుట్టింది. ప్రతి బ్రష్‌స్ట్రోక్ ఒక కథను చెబుతుంది: మనం ఇక్కడికి, ఈ మాయా నగరానికి ఎలా వచ్చాము... విశ్వాసం యొక్క ప్రతి లీపు, విధి యొక్క ప్రతి మలుపు, మనం కలలుగన్న జీవితానికి దగ్గరగా తీసుకువచ్చిన ప్రతి నిశ్శబ్ద విజయం. ఇది కేవలం కళ కాదు - ఇది మనమే. ఇది మనం జీవించిన, ప్రేమించిన మరియు కలిసి ఉన్న ప్రతిదాన్ని ఎప్పటికీ నిలుపుకుంటుంది" అనే క్యాప్షన్‌ను తన పోస్ట్‌కు జత చేసింది. అయితే తన పోస్ట్‌లో మెహ్రీన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సెగల్ , మెహ్రీన్ ఇద్దరూ కూడా ఒకే కలర్ డ్రెస్ వేసుకుని కనిపించడంతో , వీరు రిలేషన్‌లో ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ విషెష్ చెబుతున్నారు. ప్రస్తుతం సెగల్ , మెహ్రీన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications