రానా భార్య ఎమోషనల్ పోస్టు..!

టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్ ల వివాహం 2020లో హైదరాబాద్‌ లో జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మిహీకా బజాజ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు ఆమె వ్యక్తిగత, దాంపత్య జీవితానికి సంబంధించింది మాత్రం కాదు. అసలు విషయం ఏంటంటే..? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ మేరకు ముంబైలో సోమన్ కపూర్ సీమంతం వేడుక జరిగింది. ఈ ఫంక్షన్ కు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో పాల్గొన్న రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్.. హీరోయిన్ సోనమ్‌ పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే..? "చిన్నప్పుడు నేను నీ వెంటే తిరిగేదాన్ని.. ఇప్పుడు నీ పిల్లలు నీ వెంటే తిరుగుతుంటే చూడాలని ఉంది. మీరు ఇంత అందమైన జీవితాన్ని నిర్మించుకోవడాన్ని దగ్గరుండి చూడటం నాకు చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక మీ జీవితంలో మొదలవుతున్న ఈ కొత్త అధ్యాయానికి నా తరఫున ప్రేమతో శుభాకాంక్షలు" అని మిహీకా బజాజ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Miheeka Bajaj Gets Teary for Sonam Kapoor Lifelong Bond Note After Godh Bharai End of Old Drama

ఇక 2015లో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సోనమ్, ఆనంద్‌ లు మొదటిసారి కలుసుకున్నారు. అలా వారి మధ్య ఫోన్ మెసేజ్‌లతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇక 2018 లో వీరిద్దరూ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2022లో వీరికి కుమారుడు వాయు జన్మించాడు. ఇప్పుడు వాయుకు తోడుగా మరో చిన్నారి రాబోతుండటంతో అటు అహూజా కుటుంబంలో, ఇటు అనిల్ కపూర్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+