Narayana Murthy: నారాయణ మూర్తి మాట్లాడుతుండగా మైక్ లాగేసుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి..!
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రజాకార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ డైలాగ్ వార్ కొనసాగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు రాకేశ్ రెడ్డి హాజరయ్యారు. స్టేజీపై మాట్లాడారు. రజాకార్ సినిమా కాదని నిజమైన చరిత్ర అని పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించిన వారి కాళ్లు కడికి తలపై పోసుకోవాలని అన్నారు.
రాజాకార్ అనేది కొంత మందికి కేవలం సినిమా మాత్రమే కావొచ్చు.. కానీ తమకు తమ ఐదు తరాల పూర్వీకుల నరకయాతన అని వివరించారు. లక్షల మందిని చంపిన నిజాం రాజును రాజ్ ప్రముఖ్ గా నాటి ఢిల్లీ పాలకులు ప్రకటించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులా బతకాలంటే రజాకార్ మూవీ చూడాలన్నారు. ఇది గతం కాదని మనందరి భవిష్యత్ అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే నారాయణ మూర్తి స్టేజీ పైకి వచ్చారు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరికీ తలవంచలేదని కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించారని నారాయణ మూర్తి గుర్తు చేశారు. గతంలో గుజారాత్ లోని జూనాఘట్, తెలంగాణను భారత్‌లో కలిపి ఉండక పోతే నేడు ప్రజాస్వామం ఉండేది కాదని చెప్పారు. భారత్ నుంచి హిందువులు వెళ్లిపోతుంటే వచ్చే ఐదేళ్లు కూడా బీజేపీ 400 ఎంపీ సీట్లతో పాలన చేస్తుందని ప్రధాని మోడీ అంటారా? అని రాకేశ్ రెడ్డిని ప్రశ్నించారు.
దేశంలో ఎవరు ఎవరిని పంపేది లేదన్నారు. చట్టాలు అందరికీ సమానం అని స్పష్టం చేశారు. విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమే భారత్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. మత పిచ్చి వద్దని కోరారు. హిందూ ముస్లిం బాయి, బాయి అని అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆర్ నారాయణ మూర్తి వద్ద ఉన్న మైక్ రాకేష్ రెడ్డి లాగేసుకున్నారు. ఆ వెంటనే మైక్ తీసుకున్న ఆర్ నారాయణ మూర్తి.. యే తమ్ముడు.. మాట్లాడితే జైశ్రీరామ్ అంటున్నావు.. శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదని స్పష్టం చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications