Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలనం..!!

Manchu Vishnu: కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రసారమౌతోన్న సెక్సువల్ కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవలే ఘాటుగా స్పందించారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. వంటి సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వెల్లువెత్తుతున్న అసభ్య, అభ్యంతర కంటెంట్‌తో కూడిన కథనాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

తన ఫొటోలు, వీడియోలను జుగుప్సాకరమైన కంటెంట్‌లో వినియోగిస్తోన్నారంటూ బ్రహ్మానందం సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన పడ్డారని మంచు విష్ణు తెలిపారు. దీనికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. హీరోయిన్లను అసభ్యకరంగా తమ కథనాల కోసం వాడుకుంటోన్నారని చెప్పారు.

Movie Artist Association has terminated these channels says President Manchu Vishnu

సెక్సువల్ కంటెంట్‌తో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ తనకు ప్రతీరోజూ హీరో, హీరోయిన్లు, నటీనటులు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకోదలచుకున్నానని అన్నారు.

ఇలాంటి సెక్సువల్ కంటెంట్‌‌ను యూట్యూబ్ ఛానళ్లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించడానికి 48 గంటలు సమయం ఇస్తోన్నానని మంచు విష్ణు తెలిపారు. అప్పట్లోగా వాటిని తొలగించకపోతే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామనీ తేల్చి చెప్పారు.

Movie Artist Association has terminated these channels says President Manchu Vishnu

ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గడువు దాటిన నేపథ్యంలో.. అసభ్యకర కంటెంట్‌ను తొలగించని అయిదు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. తమ వేట మొదలైందని ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది.

జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్స్‌వైజెడ్ ఎడిట్జ్ 007 యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు తెలిపింది. నటీనటులు, వారి కుటుంబాలు, వ్యక్తిగత దాడుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసిన కారణంగా అయిదు యూట్యూబ్ ఛానళ్లను టెర్మినేట్ చేశామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఇది ప్రారంభం మాత్రమేనని తేల్చి చెప్పింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+