ఆరోజు అందరికీ చెప్తా.. పెళ్లిపై మృణాళ్ ఓపెన్

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది "మృణాల్ ఠాకూర్". బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ టాలీవుడ్‌లో తన మొదటి సినిమా 'సీతారామం' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనతి కాలంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా నేచురల్ స్టార్ నానితో చేసిన 'హాయ్ నాన్న' సినిమా కూడా మంచి విజయాన్ని సాధించగా.. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం మాత్రం ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తోంది.

ధనుష్‌తో ప్రేమ పుకార్లు..

గత కొన్ని నెలలుగా, మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో వారిద్దరూ కలసి కనిపించడం, ప్రత్యేకించి ఫ్రెండ్లీ బాండింగ్‌లో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది.

mrunal-thakur-shocking-comments-on-her-marriage-and-dating-rumours-with-actor-dhanush

త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతుందంటూ నటి మృణాల్‌ ఠాకూర్‌ వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలను మృణాల్‌ ఖండించింది. సిద్ధాంత్‌ చతుర్వేది ఆమె జంటగా నటించిన చిత్రం 'దో దివానే సెహర్‌ మే'. ఈ సినిమా ఈ నెల 20న విడుదలకానున్న సందర్భంగా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది మృణాల్‌.

ప్రేమికుల రోజున మీ వివాహమంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్తలపై మీ స్పందనేంటి.. అనే ప్రశ్నకు ''నన్ను ఎవరూ పిలవలేదు ఆ పెళ్లికి. నేను ఈ రూమర్స్‌ అన్నీ చూస్తూ చాలా నవ్వుకుంటున్నాను. ఇలాంటివి సృష్టిస్తున్న వాళ్లందరికీ థ్యాంక్స్‌. మీరంతా నా కోసం ఫ్రీ పీఆర్‌ చేస్తున్నారు. దీనిపై నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే.. మీరు అనుకుంటున్నట్లు అది నిజం కాదు. కావాలంటే ఫిబ్రవరి 14న మీరే చూస్తారు. నేను పెళ్లి చేసుకుంటే ఆ వార్తని శ్రీ గణేశుడితో పాటు అభిమానులతోనూ తప్పకుండా పంచుకుంటాన''ని మృణాల్‌ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు మీ జీవితంలో ప్రేమ ఉందా? అనే ప్రశ్నను మృణాల్‌ 'అది వ్యక్తిగత ప్రశ్న' అంటూ చిరునవ్వుతో దాటవేసింది. గతంలోను మృణాల్‌ ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడి గురించి ప్రస్తావించింది. తనది దూకుడు స్వభావమని, నటించడం అతనికి ఇష్టంలేదని చెప్పడంతో బ్రేకప్‌ చెప్పినట్టు తెలిపింది. అతను పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల తన మనస్తత్వం అలా ఉందని అతని తప్పేం లేదని.. భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారని విడిపోయామని పంచుకుంది. ఈ నిర్ణయం పట్ల తను ఏ మాత్రం బాధపడలేదని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+