షాకింగ్ వీడియో: బేబీ బంప్‌తో మృణాల్..! పెళ్లి కాకుండానే..!
'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం అడివిశేష్ తో డెకాయిట్ మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేస్తోంది. అయితే ఇటీవల మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ బేబీ బంప్ తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దాంతో పెళ్లి కాకుండానే మృణాల్ గర్భవతి అయిందా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోలో మృణాల్ ఠాకూర్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ధరించి ఉంది. ఆమెకు బేబీ బంప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మృణాల్ పక్కనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఆమె చేయి పట్టుకుని హెల్ప్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఇక ఈ వార్త తెగ వైరల్ అయిన నేపథ్యంలో అభిమానులకు అసలు విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే నటి మృణాల్ ఠాకూర్ నిజంగా గర్భవతి కాలేదని సమాచారం. ఇది కేవలం ఒక సినిమా షూటింగ్ లోని సీన్ అని తెలుస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం కోసం మృణాల్ ప్రెగ్నెంట్ పాత్ర వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 2026 ఏప్రిల్ 10న విడుదల కానుంది. వరుణ్ ధావన్- మృణాల్ ఠాకూర్ కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రంలో మృణాల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications