తిరుమల కొండపై శ్రీలీల బుగ్గ గిల్లిన తమన్

ఎంతో పవిత్రమైన తిరుమల కొండపై సంగీత దర్శకుడు తమన్ హీరోయిన్ శ్రీలీల బుగ్గ గిల్లడం ఏమిటి? అనే అనుమానం మీకు రావచ్చు. కానీ అది నిజం. నటి శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట శ్రీలల మీడియాతో మాట్లాడి దర్శనం చాలా సంతోషంగా జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

కొత్త పని ప్రారంభించేటప్పుడు స్వామి దర్శనం
తాను ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం అలవాటు అన్నారు. అయితే ఏమి ప్రారంభించబోతున్నారనే విషయాన్ని వెల్లడం చెప్పలేదు. ప్రస్తుతం ఆమె నితిన్ కథానాయకుడిగా వస్తున్న రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. దేవుడిని దర్శించుకొని బయటకు వస్తున్న సమయంలో సంగీత దర్శకుడు తమన్ ఆలయం లోపలకు వెళుతున్నారు. శ్రీలీలను చూసి ఆగి పలకరించారు. తర్వాత బుగ్గగిల్లి కరచాలనం చేసి వెళ్లిపోయారు. శ్రీలీల ఇటీవల నటించిన భగవంత్ కేసరి, గుంటూరు కారం, స్కంద చిత్రాలకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

music director SS Thaman Touhces Sree Leela Cheeks at Tirumala srivari temple

శ్రీలీల వేగానికి అడ్డుకట్ట
శ్రీలీల పరిశ్రమలో జెట్ స్పీడులో దూసుకుపోతుండగా వరుసగా ఫ్లాప్స్ వచ్చి ఆమె వేగానికి అడ్డుకట్ట వేశాయి. గతేడాది, ఈ ఏడాది కలుపుకొని వరుసగా నాలుగు సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అప్పటివరకు లక్కీ హ్యాండ్, గోల్డెన్ లెగ్ అన్నవారంతా సైలెంటయ్యారు. శ్రీలీల కూడా ఆచితూచి సినిమాలు ఒప్పుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పింది. పరీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానంది. అయితే నితిన్ తో చేసే సినిమాతో పాటు మరొక్క సినిమానే ఆమె చేతిలో ఉంది. భవిష్యత్తులో ఎటువంటి సినిమాలు చేయబోతుంది? ఏ ప్రాజెక్టులను ఎంచుకుంటుంది? అనేది కొంతకాలమైతేకానీ బయటకు రాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+