అది చూసి గుండె బరువెక్కింది అంటున్న తమన్..
చిత్ర పరిశ్రమలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లలో తమన్.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో సైతం సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం అఖండ 2, హరిహర వీరమల్లు సహా పలు పాన్ ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇక తమన్ అందించే బ్యాగ్రౌండ్ స్కోర్‌కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బాలయ్య నటించిన అఖండ, డాకు మహరాజ్ సినిమాలతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.
సినిమాలతో పాటు క్రికెట్ పట్ల కూడా ఎక్కువ మక్కువ చూపే ఈ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమాల గురించే కాకుండా పలు ఆసక్తికర విషయాలపై సైతం తమన్ స్పందింస్తుంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో నెటిజన్లతో కంటతడి పెట్టిస్తోంది. అంతే కాకుండా ఆ పోస్టులో కళ్లు కన్నీటితో నిండిపోయాయి. మనసంతా సంతోషంతో ఉంది అంటూ రాసుకొచ్చారు.
ఇక ఆ వీడియో విషయానికి వస్తే.. తమిళనాడులో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. హైవే పక్కన ఓ ముసలాయన కూర్చొని అటుగా వెళ్లిపోతున్న కారులకు జెండా ఊపుతూ హోటల్లో భోజనం చేయండి అంటూ కోరుతున్నారు. అయితే ఎండలో కూర్చున్న ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా ఒక టోపీ పెట్టుకొని ఉండడం ఓ యువకుడిని కలచి వేసింది. వెంటనే ఆ పెద్దాయనను పిలిచి ఎందుకని కనీసం గొడుగు, చెప్పులు కూడా లేకుండా ఎండలో నిల్చున్నారు అని అడిగాడు.
అందుకు ఆయన హోటల్ వాళ్లని అడిగితే గొడుగు కొంటాంలే అంటున్నారు కానీ కొని ఇవ్వడం లేదు.. ఇక చెప్పులు అయితే రాత్రి కుక్కలు కొరికేశాయ్ అంటూ వాపోయాడు. దాంతో ఆ యువకుడు వెంటనే ఆ పెద్దాయన కోసం చెప్పులు, గొడుగు, ఓ జ్యూస్ బాటిల్ కూడా కొనుక్కొని తీసుకువచ్చి ఇస్తాడు. ఆ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియని ఆ పెద్దాయన కృతజ్ఞతలు చెబుతూ చేతిని ముద్దు పెట్టుకుంటాడు. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. వీడియో చూసిన వారంతా ఆ యువకుడిని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక రీసెంట్ గానే తమన్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన పోర్షా కయెన్ కారును బహుమతిగా అందజేశారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని బాలయ్య చెప్పుకొచ్చారు. అలాగే వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు ప్రేమతోనే కారు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి. ఆ కారు విలువ సుమారు రూ.2 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications