నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు.. అల్లు అర్జున్‌పై నాగబాబు సెటైర్స్..?
గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది. మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.
మెగా వర్సెస్ అల్లు అభిమానుల అయితే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది.అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తోందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు.మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి.

అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. తాజాగా ఆయన పుష్ప-2 సినిమా విడుదల సమయంలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ''నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరి చేసుకో.. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్ట తరంగా మారగలదు. తప్పును సరిదిద్దుకో'' అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
"If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong".
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 1, 2024
- Swami Vivekananda.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గురించి ఆ మధ్య మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక అభిమాని అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్ అని ప్రశ్నించగా, పుష్ప 2 కోసం వెయిటింగ్ చేస్తోన్నా అంటూ నాగబాబు కామెంట్ చేశారు. మరొక సందర్భంలో అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు అని అడిగితే అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని ఆయన చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications