విజయ్ దేవరకొండ సినిమాపై నాగ చైతన్య కౌంటర్
విజయ్ దేవరకొండ..'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గీతగోవిందం' తరువాత దర్శకుడు పరుశురామ్‌తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా కావడంతో 'ఫ్యామిలీ స్టార్'పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
కథలో కొత్తదనం లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్'పై ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశ ఎదురైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే సినిమాకు నెగిటివ్ రివ్య్వూస్ రావడంతో నాగ చైతన్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'ఫ్యామిలీ స్టార్' కథను మొదట నాగ చైతన్యకు వినిపించాడట దర్శకుడు పరుశురామ్. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తరువాత నాగ చైతన్యతో పరుశురామ్ ఓ సినిమా ప్లాన్ చేశాడు.

కథ కూడా లాక్ చేసి సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో సడన్‌గా నాగ చైతన్యతో సినిమాను పరుశురామ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ వెంటనే విజయ్ దేవరకొండతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. పరుశురామ్‌తో సినిమా గురించి నాగ చైతన్యను ప్రశ్నించగా, అతను గురించి నన్ను అడక్కండి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పరుశురామ్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అతను నా టైంను వేస్ట్ చేశారని చైతు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చైతన్యతో చేయాల్సిన సినిమాను విజయ్ దేవరకొండతో చేయడం ..ఆ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.పరుశురామ్‌ను టార్గెట్ చేసుకుని చైతు అభిమానులు రెచ్చిపోతున్నారు. ఖర్మ ఎవరిని వదిలిపెట్టదంటూ దర్శకుడు రుశురామ్‌కు నాగ చైతన్య అభిమానులు కౌంటరిస్తున్నారు.












Click it and Unblock the Notifications