అందుకే అందరూ సమంతను ఇష్టపడతారు: నాగచైతన్య
తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారసుడిగా రంగప్రవేశం చేసిన నాగచైతన్య ప్రస్తుతానికి మీడియం రేంజ్ హీరో స్థాయికి చేరాడు. స్టార్ హోదా రాకపోయినప్పటికీ అతను తనకంటూ ఓ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఒక మాములు పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంతపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంటర్వ్యూలో హోస్ట్ నాగచైతన్యని.. మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి అని ప్రశ్నించగా.. దానికి సమాధానంగా నాగచైతన్య.. కృతి శెట్టి, పూజా హెగ్డే , సమంతల గురించి వివరించాడు. సమంత గురించి మాట్లాడుతూ ఏదైనా చేయాలి అనుకుంటే ఎంత కష్టమైనా చేసేస్తుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ పనిని మాత్రం పూర్తిచేస్తుందని చెప్పాడు. అంతేకాదు.. తనకు విల్ పవర్ ఎక్కువని, హార్డ్ వర్కర్ కావడంవల్లే సమంతను అందరూ ఎక్కువగా ఇష్టపడతారంటూ కొనియాడాడు.

సమంత-నాగచైతన్య విడిపోయిన తర్వాతే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ అడుగు తీసి అడుగు వేస్తే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వాస్తవానికి వీరిద్దరూ విడిపోకూడదని అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో కోరుకున్నారు. మళ్లీ కలవకపోతారా అనే ఆశతో ఎదురుచూసేవారు కూడా ఉన్నారు. ఇటువంటి తరుణంలో తన మాజీ భార్య గురించి నాగచైతన్య అంత సానుకూలంగా మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వీరిద్దరూ విడిపోవడంలో సమంతదే ఎక్కువ తప్పని చాలామంది జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. వాస్తవం ఏదన్నా కానీ విడిపోయి రెండున్నర సంవత్సరాలవుతున్నప్పటికీ సమంతను నాగచైతన్య ప్రశంసించడంపై తనపై ఇంకా ప్రేమగానే ఉన్నాడంటున్నారు.












Click it and Unblock the Notifications