యూరప్‌లో శోభితాతో నాగ చైతన్య అలా
సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు.తాజాగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లాడని తెలుస్తోంది.
ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు పార్టీలో కలిసిన ఫొటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.

గతంలో కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు. ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో మొదటిసారి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను నాగ చైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం నాగ చైతన్య ,శోభితకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications