అడ్డంగా బుక్ అయిన నాగ చైతన్య..ఆ హీరోయిన్‌తో బయటపడ్డ సీక్రెట్ ఎఫైర్..!
సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు.తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారా అంటూ నెటిజన్లు వీరిని ప్రశ్నిస్తున్నారు. నాగ చైతన్య శోభితతో ఇలా దొరికిపోయాడేంటీ..? అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

వీరిద్దరు కలిసి మరోసారి దర్శన ఇచ్చారు. శోభితతో నాగచైతన్య కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు పార్టీలో కలిసిన ఫొటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే శోభితతో నాగచైతన్య ఎఫైర్ మరోసారి బయటపడింది.
శోభిత ధూళిపాళ తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఎప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫొటోలను విడుదల చేసే శోభిత ఈసారి పద్దతిగా చీర కట్టుకున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి, శోభిత ఫొటోలకు నాగ చైతన్య లైక్ కొట్టడమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టే పోస్టులకు నాగ చైతన్య లైక్ కొట్టుకుంటున్నారని అంతా చర్చించుకుంటున్నారు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications