సమంతతో జర్నీ వర్క్ అవుట్ కాలేదు : నాగచైతన్య
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.
పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. త్వరలో వీరు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "ఖచ్చితంగా చాలా ఉత్సాహం ఉంది, సీతాకోకచిలుకలు.. ఎక్కువ కాదు (నవ్వుతూ). వివాహ వేడుక మాకు ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుందని నాగ చైతన్య తెలిపారు. మా తాతగారి విగ్రహం ముందు పెళ్లి జరిపించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మా రెండు కుటుంబాలు కలిసి వేడుకలు నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామని నాగ చైతన్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.
"నేను శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి, కలిసి జీవితాన్ని పంచుకోడానికి ఎదురు చూస్తున్నాను. నేను ఆమెతో డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఆమె నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నాలో ఖాళీని పూర్తి చేస్తుంది. మున్ముందు మాది అద్భుతమైన ప్రయాణం కానుంది" అని చైతూ అన్నారు. ''నా పెళ్లి స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సమంత తనని అర్థం చేసుకోలేకపోయిందని, ఆమెతో తన జర్నీ వర్క్ అవుట్ కాలేదనే అర్థం వచ్చేలా చైతన్య మాట్లాడారనే అభిప్రాయం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications