అక్కినేని వారసుడికి 16 ఏళ్లు!
Naga Chaitanya: తెలుగు సినీ ఇండస్ట్రీలో 16 ఏళ్లగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాగచైతన్య. 2009లో 'జోష్' చిత్రంతో అడుగుపెట్టినప్పటి నుంచి విభిన్న పాత్రలు, విభిన్న కథలను ఎంచుకుంటూ నాగచైతన్య తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ప్రేమకథల హీరోగా, మాస్ యాక్షన్ హీరోగా, ఆ తర్వాత యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పాత్రలతో ప్రేక్షకుల మన్నలను పొందుతున్నారు.
విభిన్న కథలతో ఆకట్టుకున్న చైతూ
నాగ చైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ చైతన్య మొదటి సినిమా 'జోష్' అప్పటి యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత తన రెండో సినిమా 'ఏ మాయ చేసావే (2010)'తో చైతూ ప్రేమకథల హీరోగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. తర్వాత 'మనం' (2014) వంటి ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకొని, కేవలం మాస్ హీరోగానే కాకుండా, విభిన్న కథలను ఇష్టపడే హీరోగా పేరు తెచ్చుకున్నారు.

ప్రేమకథల నుంచి మాస్ హీరోగా..
'ఏ మాయ చేసావే', 'ప్రేమమ్', '100% లవ్' వంటి విజయవంతమైన ప్రేమకథల ద్వారా నాగచైతన్య గుర్తింపు పొందారు. కానీ ఆయన కేవలం ఒకే జోనర్ కు పరిమితం కాకుండా.. తనలోని నటుడిని బయటపెట్టడానికి ఆ తర్వాత యాక్షన్ చిత్రాలు, కమర్షియల్ సినిమాలను కూడా ఎంచుకున్నారు. 'తడాఖా(2013)' 'ఆటోనగర్ సూర్య' (2014), 'శైలజా రెడ్డి అల్లుడు' (2018), 'సవ్యసాచి' (2018) వంటి సినిమాలు ఆయనలో మాస్ హీరోని బయటపెట్టాయి. ప్రేమకథలను ఎంత సులభంగా చేయగలరో, యాక్షన్ సన్నివేశాలను కూడా అంతే సునాయాసంగా పోషించగలనని చైతూ నిరూపించాడు.
'మజిలీ' (2019), 'లవ్ స్టోరీ' (2021), మరియు ఇటీవల వచ్చిన 'తండేల్' (2025) వంటి చిత్రాలు నాగ చైతన్య నట జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచాయి. 'మజిలీ'లో ఒక అద్భుతమైన కుటుంబ పాత్రను, 'లవ్ స్టోరీ'లో దళిత యువకుడిగా, 'తండేల్'లో మత్స్యకారుడిగా ఆయన నటన ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. 'తండేల్' సినిమా ఆయన కెరీర్‌లోనే ఒక కీలక మార్పును సూచిస్తుంది. ఇది ఆయనను మరింత వాస్తవికమైన, పల్లెటూరి పాత్రలవైపు నడిపింది.
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి..
నాగ చైతన్య కెరీర్‌లో ఒక కీలక విషయం ఏమిటంటే.. ఆయన ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి భయపడలేదు. 'ధూత' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగు చిత్రసీమలో ఓటీటీకి అడుగుపెట్టిన అతికొద్ది మంది మెయిన్‌స్ట్రీమ్ హీరోలలో నాగ చైతన్య ఒకరు. సిటీ లవ్ స్టోరీస్ నుంచి పల్లెటూరి మాస్ హీరోగా.. భావోద్వేగ డ్రామాల నుంచి యాక్షన్ చిత్రాల వరకు నాగచైతన్య ఎంచుకున్న కథల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయోగాలను కొనసాగించాలనే నాగచైతన్య కోరిక.. ఆయన కెరీర్‌ను నిరంతరం కొత్తగా.. ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంచుతుంది.
తెలుగు చిత్రసీమలో 16 వసంతాలు పూర్తిచేసుకున్ననాగ చైతన్య.. తన నటజీవితంలో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. 'తండేల్' వంటి విజయాల తర్వాత, ఆయన NC24 వంటి కొత్త ప్రాజెక్టులతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య ప్రేమకథలు, కుటుంబ కథలు, లేదా మాస్ యాక్షన్ చిత్రాలు ఏదైనా సరే, అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించగల నటుడు అని నిరూపించుకున్నాడు.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications