ఆమెతో నా తొలి ముద్దు ఎప్పటికి మర్చిపోలేను - నాగ చైతన్య
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు.విడాకులపై నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.

అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు. అయితే నాగ చైతన్య శోభిత ధూళిపాళతో ప్రేమ వ్యవహారం నడిపి, ఆమెను వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సింగిల్‌గానే ఉన్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు.ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా నిర్వహించిన ఓ షోలో పాల్గొన్నారు.ఆ సమయంలో ఆయన తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. తొమ్మిదో తరగతిలోనే మొదటి ముద్ద ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య బయటపెట్టారు.
"ఆ ముద్దు నా జీవితమంతా పని చేసింది" అని నవ్వుతూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఓ అభిమాని నాతో మాట్లాడుతూ ..సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగ చైతన్య తెలిపారు. ఈ ఇంటర్య్వూ జరిగే సమయానికి నాగ చైతన్య, సమంత కలసే ఉన్నారు. వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావేలోనే ఈ జంట ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈ మూవీలో చైతూ, సమంత రొమాన్స్ సీన్లు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2021లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications