సమంత పోస్ట్‌కు నాగ చైతన్య కామెంట్.. ఎందుకు వదిలేశావ్ అంటూ
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు. వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు.

విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి గురించి మరోసారి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులైన సందర్భంగా సమంత వారికి అభినందనలు తెలిపింది. ఇదే పోస్ట్‌కు నాగ చైతన్య సైతం రియాక్ట్ అయ్యాడు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులుకు అభినందనలు తెలిపాడు చైతన్య. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ నెటిజన్ నాగ చైతన్యను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నించాడు. "అసలు సమంతకు ఎందుకు విడాకులు ఇచ్చారు? కారణం ఏంటో చెప్పండి" అని ఆ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఎంతగా ఆసక్తి చూపిస్తారో మరోసారి స్పష్టం చేసింది. ఒక ఆనందకరమైన సందర్భంలో కూడా ఒక పాత వివాదం గురించి ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications