నాగచైతన్య సంతోషంగా లేడు: నాగార్జున
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య గత నెల ఎనిమిదో తేదీన సహ నటి శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహాన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లేదంటే పారిస్ లో చేయాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. 2017లో సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం ఒంటరిగానే ఉన్న నాగచైతన్య తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అనుమతితో నిశ్చితార్థం జరుపుకొని వివాహానికి బాటలు వేసుకున్నారు.
విడిపోయిన తర్వాత మనోవేదనకు గురయ్యాడు
నాగచైతన్య వివాహానికి సంబంధించి నాగార్జున ఆ సమయంలో ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి పలు విషయాలను పంచుకున్నారు. సమంతతో విడిపోయిన సమయంలో నాగచైతన్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, ఇప్పుడు మళ్లీ శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత అతనిలో ఆనందాన్ని చూస్తున్నామని నాగార్జున చెప్పారు. నాగచైతన్య సంతోషంగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సమంతతో విడిపోయిన సమయం అంత తేలిక కాదని, తమ కుటుంబానికి, నాగచైతన్యకు అది చాలా గడ్డు సమయమన్నారు. ఆ సమయంలో చైతూ తీవ్ర నిరాశకు గురయ్యాడని, అయితే తన బాధను చైతూ ఎవరితోను పంచుకోడదని, తన కొడుకు సంతోషంగా లేడనే విషయం తనకు తెలుసన్నారు.

కుటుంబానికి సంతోషకరమైన సమయం
తమ కుటుంబానికి ఇప్పుడు జరిగిన నిశ్చితార్థం ఎంతో సంతోషకరమైన సందర్భమని, నాగచైతన్య-శోభిత అద్భుతమైన జంట అని, వారిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారని, చైతూ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని నాగార్జున చెప్పారు. ప్రస్తుతం నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. నాగచైతన్య వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని పరిశ్రమలో అందరూ చెబుతుంటారని, సమంతతో విడిపోయిన తర్వాత ఈరోజు వరకు ఎక్కడా ఒక్కమాట కూడా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడలేదని, అతని వ్యక్తిత్వాన్ని ఇది నిరూపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications