దరిద్రం కొట్టేసింది భయ్యా.. నిర్మాత నాగవంశీకి మరో 10 కోట్లు బొక్క..!
టాలీవుడ్ లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు నిర్మించి అటు సక్సెస్ లతో పాటు భారీ పరాజయాలని కూడా చవిచూశారు. తనకు ఏది అనిపించినా నిర్మోహమాటంగా చెప్పేసే నాగవంశీ.. సోషల్ మీడియాలోనూ తరుచూ వైరల్ అవుతుంటారు. ముఖ్యంగా ప్రమోషన్లలో ఆయన కామెంట్స్ వల్ల నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటారు. నాగవంశీ డైలాగులు కొన్నిసార్లు మాస్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు నెగటివ్ రియాక్షన్స్ తెచ్చుకుంటాయి.
వరుస ఫెయిల్యూర్స్..
అయితే ఈ మధ్యకాలంలో నాగవంశీకి వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న "కింగ్‌డమ్" ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అలానే 80 కోట్లు పెట్టి తీసుకున్న "వార్ 2" రైట్స్ కూడా ఆయనకు భారీ షాక్ ఇచ్చాయి. దీంతో ఆర్థికంగా పెద్ద షాక్ తగిలింది.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా సైలెంట్ అయిన ఈ నిర్మాత.. "లోక చాప్టర్ 1" అనే సినిమాతో కొంత ఊరట వచ్చింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో లాసెస్ కొంచెం కవర్ అయినట్టు భావిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా 'ప్రేమలు' ఫేమ్ నటుడు నస్లెన్ కీలక పాత్రలో మెప్పించారు.
మ్యాజిక్ మూవీ..
ఇక నాగవంశీకి మరో షాక్ తగలనుందని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "మ్యాజిక్" అనే సినిమాని ప్రారంభించారు. నిజానికి "కింగ్‌డమ్" కంటే ముందే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ రీ-షూట్స్, రీ-టేక్స్, ప్యాచ్ వర్క్‌లతో మూవీ లేట్ అవుతూ వచ్చింది. దాంతో బడ్జెట్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువైంది.
ఈ మూవీలో సారా అర్జున్ లీడ్ రోల్ లో నటించింది. నాన్న, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో తెలుగులో కూడా ఈమె మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అంతేకాకుండా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం ఇవ్వడంతో హైప్ రెట్టింపైంది.

ఇప్పుడు "కింగ్‌డమ్" ఫెయిల్యూర్ తర్వాత నిర్మాత నాగవంశీ - గౌతమ్ తిన్ననూరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని టాక్. దాంతో "మ్యాజిక్" మూవీ రిలీజ్‌ను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి నాగవంశీ దాదాపు 10 కోట్లు పెట్టారని సమాచారం. సినిమా రిలీజ్ లేకుండా హోల్డ్‌లో ఉండటంతో.. నాగవంశీకి కనీసం 10 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఇండస్ట్రీ టాక్.
థియేట్రికల్ రిలీజ్ అయితే అసాధ్యమని అనుకుంటుండగా.. కనీసం ఓటీటీకి అమ్మితే కొంత అయినా రికవరీ అవుతుందని చెబుతున్నారు.
-
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్












Click it and Unblock the Notifications