మళ్లీ కలవబోతున్న నాగచైతన్య, సమంత?

ఈ ఏడాది సమంత రెండు చిత్రాలతో ముందుకొచ్చింది. అందులో శాకుంతలం నిరాశపరచగా, ఖుషీ సినిమా మాత్రం పర్వాలేదనిపించుకుంది. లాభాలను కూడా
ఈ సినిమా కళ్ల చూసిందని చెబుతున్నారు. నాగచైతన్య ఇటీవలికాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోతున్నాడని అభిమానులు ఆవేదనలో ఉన్నారు. తర్వాత సినిమాతో భారీ విజయం సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో నాగచైతన్య ఫోటోలు సైతం సమంత ఇన్ స్టాగ్రామ్ లో కనిపించలేదు. హఠాత్తుగా ఇప్పుడు సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయ్యేవాళ్లకు చైసామ్ పెళ్లి ఫోటోలతో పాటు వాళ్లిద్దరూ విహార యాత్రకు వెళ్లిన ఫోటోలు సైతం కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన అక్కినేని అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చై, సామ్.. ఇద్దరూ కలవబోతుంటే అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఇంతకంటే మంచి వార్తే ఉండదు.

nagachaitanya and samantha latest news

నాగచైతన్యకు సంబంధించిన ఫొటోలు కనపడకుండా ఆర్చీవ్ చేసిన సమంత వాటిని తిరిగి ఇన్ స్టా లోకి వచ్చేలా చేయడంతో ఏం చెప్పబోతుందా? అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి జోడి సూపర్ అని, బెస్ట్ కపుల్ అని, క్యూట్ జోడీ అని నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. విడాకులు తీసుకున్న సమయంలో అందరూ ఎక్కువగా సమంతనే టార్గెట్ చేశారు. నాగచైతన్య గురించి ఎక్కడా నెగెటివ్ కామెంట్స్ రాలేదు.

ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందంటున్నారు. ఇద్దరికీ వేర్వేరుగా క్రేజ్ పెరుగుతోంది. చైతన్య పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సామ్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నటన పరంగా వంక పెట్టే పనిలేకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+