నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా?
అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత కొన్నాళ్లు విడిగా ఉండి తర్వాత బాలీవుడ్ నటి శోభితను ప్రేమించాడు. సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్లు అనుకున్నారు. హఠాత్తుగా నిశ్చితార్థం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే నెల నాలుగోతేదీ రాత్రి 8.13 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి వివాహం జరగబోతోంది. ముందుగా నాగార్జున స్టూడియోలో ఉన్న 20 ఎకరాల్లో వివాహాన్ని భారీగా చేద్దామని భావించినప్పటికీ నాగచైతన్య ఒప్పుకోలేదు. నిరాడంబరంగా చేసుకుంటానని చెప్పడంతో కేవలం 300 మంది అతిథులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు.
ముంబయిలో కాపురం అంటోంది
శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో వివాహం కూడా వారి సాంప్రదాయం ప్రకారం జరగబోతోంది. దాదాపు ఎనిమిది గంటల సమయం అందుకు పడుతుందని అంటున్నారు. పెళ్లయిన తర్వాత కాపురం ముంబయిలో పెడదామని శోభిత నాగచైతన్యతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు అక్కడ ఎక్కువగా అవకాశాలు రావడం, వెబ్ సిరీస్ లు చేయడంలాంటివి ఉండటంతో అక్కడైతే బాగుంటుందని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై నాగచైతన్య నుంచి ఏం సమాధానం వచ్చిందనేది తెలియదు. వీరిద్దరి పెళ్లి జరుగుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జున వీరికి మంచి బహుమతులను ఇవ్వబోతున్నారు.

కార్లంటే ఇష్టం కాబట్టి లగ్జరీ కారును ఇస్తున్నాడు
నాగచైతన్యకు కార్లు అంటే బాగా ఇష్టం. ఇప్పటికే హైదరాబాద్ రేసింగ్ క్లబ్ ను కొనుగోలు చేశారు. స్నేహితులు హితవు చెప్పడంతో కారును కూడా చాలా నెమ్మదిగా నడుపుతాడు. గతంలో చాలా వేగంగా నడిపేవాడు. నాగార్జున 2.5 కోట్ల విలువ చేసే అధునాత లెక్సస్ LM MPV కారును బహుమతిగా ఇస్తున్నారు. రెండురోజుల క్రితమే దాన్ని కొనుగోలు చేయించి రిజిస్టర్ చేయించారు. లగ్జరీకారును ఇద్దామని నాగార్జున అనుకున్నారంట. అలాగే శోభితకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నారు. శోభిత కోడలిగా రావడంపై నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారని సమాచారం. నయనతార తరహాలో నాగచైతన్య-శోభిత పెళ్లిని కూడా డాక్యుమెంటరీగా తీయాలని నెట్ ఫ్లిక్స్ అనుకుంటోందని వార్త రావడంతో నాగచైతన్య టీం ఆ వార్తను ఖండించింది. నయనతారకు నెట్ ఫ్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications