నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్‌గా పనికిరాడు..కంటెస్ట్ షాకింగ్ కామెంట్స్

హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మథుడని, గ్రీకు వీరుడని , అమ్మాయిల కలల రాకుమారడని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండితెర మీదే కాదు.. బుల్లితెరపై కూడా తనకు ఎవరూ పోటీ లేరని బిగ్‌బాస్ షోతో నాగార్జున నిరూపించుకున్నారు. నాగార్జున కంటే ముందు ఎన్టీఆర్, నాని వంటి వారు బిగ్‌బాస్ హోస్ట్‌గా పని చేశారు. కానీ నాగార్జున అంత అందంగా వారు కనిపించలేకపోయారు. బిగ్‌బాస్ మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు నాగార్జుననే హోస్ట్‌గా పని చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్‌లతో నాగార్జున కలిసిపోతుంటారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పలువురి కంటెస్ట్‌లకు నాగార్జున సాయం చేయడం జరిగింది.

నాగార్జున హోస్టింగ్‌పై దాదాపు అందరూ కూడా ప్రశంసలు కురిపించిన వారే. అయితే ఓ కంటెస్ట్ మాత్రం నాగార్జున హోస్టింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగార్జునకు హోస్టింగ్ చేయడం చేతకాదనే అభిప్రాయాన్ని సదరు కంటెస్ట్ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇలా నాగార్జున మీద విమర్శలు చేసింది మరెవరో కాదు..సోనియా ఆకుల.బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో పాల్గొన్న సోనియా ఆకుల, నాగార్జున హోస్ట్‌గా సరిగ్గా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. నాగార్జున హోస్టింగ్‌లో తాను కొన్ని లోపాలు గమనించానని అన్నారు.హౌస్‌మేట్స్‌తో ఆయన వ్యవహరించే తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, రానా హోస్ట్‌గా వస్తే బాగుంటుందని ఆమె చెప్పడం జరిగింది. సోనియా ఆకుల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Nagarjuna is not fit to be a Bigg Boss host contest shocking comments

కొంతమంది ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా, మరికొందరు నాగార్జునను సమర్థిస్తున్నారు. ఇక సోనియా ఆకుల విషయానికి వస్తే.. 2019లో విడుదలైన "జార్జ్ రెడ్డి" సినిమాతో ఆమె సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ సినిమాలో ఆమె రెడ్డి సోదరి పాత్రను పోషించారు.కరోనా వైరస్ (2020), ఆశా ఎన్‌కౌంటర్ (2022) వంటి సినిమాల్లో ఆమె నటించారు. ఆ తర్వాత ఐస్మార్ట్ జోడి సీజన్ 3లో ఆమె పాల్గొన్నారు.సోనియా ఆకుల 2024లో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లో పాల్గొన్నారు. ఆ షోలో ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే స్వభావంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఆమె కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+