నాగార్జున 100 వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ ఆ రోజే.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రంగా 100 వ సినిమా రెడీ అవుతోంది. 99 సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 100 వ లాండ్ మార్క్ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో రూపొందుతోంది. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కేవలం గ్లింప్స్ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ పైనా ఆ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కింగ్ 100వ సినిమా నుంచి భారీ అప్డేట్ రానున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ రూ. 100 కోట్ల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున 100 వ సినిమా అప్డేట్ నేపథ్యంలో ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఈ సర్‌ ప్రైజ్ ను అభిమానులు ఆస్వాదించబోతున్నారు.

Nagarjuna The first glimpse of Nagarjuna 100th film is coming on that very day real treat for fans

ఇక నాగార్జున ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగార్జున ఒకే తరహా పాత్రలో కనిపించరని ఎన్నడూ చేయని విధంగా 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వివిధ దశల్లో ఆయన కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన లుక్, గెటప్‌ లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. మిగతా చిత్రాలతో పోల్చితే నాగార్జున తన 100వ సినిమాలో విభిన్నమైన షేడ్స్ ను చూపించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు సినీ వర్గాల్లో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు, సుష్మిత భట్, విజయేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆగస్టు 29న విడుదల కానున్న ఫస్ట్ గ్లింప్స్‌, టైటిల్ తో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+