బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్

నందమూరి బాలకృష్ణ ఈనెల 12వ తేదీన డాకూ మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను పకలరించబోతున్నారు. మరోవైపు తన తనయుడు, సినీ వారసుడైన మోక్షజ్ఞను పరిశ్రమకు పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అదిగో ఇదిగో అంటున్నారుకానీ ఈ సినిమాపై సరైన స్పష్టత ఇవ్వడంలేదు. ప్రశాంత్ వర్మ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని, బాలయ్య గట్టిగా రెండిచ్చాడని వార్తలు వచ్చాయి. డాకూ మహారాజ్ విడుదలైన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమా చేయనున్నాడు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వార్2 చేస్తున్నాడు. దీనిపై పెద్దగా హైప్ రావడంలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రగ్ మాఫియా కథతో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9న ఇది విడుదల కాబోతోంది.

బోయపాటి ప్రయత్నించేసరికి గొడవలు తీవ్రస్థాయికి చేరాయి
బాలయ్యకు, తారక్ కు విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయికానీ అటువంటివేమీ లేవని తారక్ అంటున్నాడు. బోయపాటి శ్రీను వీరిద్దరినీ పెట్టి మల్టీస్టారర్ సినిమా తీయడానికి ప్రయత్నించారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్న సమయంలో ఈ ప్రయత్నం జరిగింది. బాలయ్య, తారక్.. ఇద్దరూ దీనికి ఓకే చెప్పారు. బోయపాటి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి కాల్షీట్లు ఖాళీ లేవు. ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసే సరికి వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. బోయపాటి ప్రయత్నించినప్పటికీ ఆ కథ పట్టాలెక్కలేదు. బాలయ్యకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటి తారక్ తో దమ్ము సినిమా చేయగా ఇది నిరాశపరిచింది. భవిష్యత్తులో కూడా బాలయ్య, తారక్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం కనపడటంలేదు.

nandamuri balakrishna and junior ntr combination missed movie details here

సయోధ్య కుదర్చడానికి ఎవరు ముందుకు వస్తారు?
అయితే మోక్షజ్ఞ - తారక్ కాంబినేషన్ లో సినిమా రావడానికి అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇప్పుడే హీరోగా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మోక్షజ్ఞ మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉండదు. తాను మాస్ హీరోగా నిలదొక్కుకోవాలి.. స్టార్ డం సంపాదించాలి.. ఆ తర్వాతే మల్టీస్టారర్. దీన్నిబట్టి అది కూడా కుదరకపోవచ్చు. ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబంలో ఇలా విభేదాలుండటం మాత్రం శోచనీయమంటున్నారు అభిమానులు. తారక్ అభిమానులు డాకూ మహారాజ్ ను బహిష్కరిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం తాము సినిమా చూస్తామని, సూపర్ హిట్ చేస్తామంటూ పోటీగా వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ గొడవలు ఇలాగే కొనసాగుతాయా? లేదంటే ఎవరైనా సయోధ్య కుదురుస్తారా? అనేది కాలమే తేల్చాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+