బాలయ్య అందరినీ కొడతాడుకదా.. కానీ ఆయన్ని కొట్టిన ఇద్దరు డైరెక్టర్లు ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ అంటే సెట్స్ మీద సీరియస్‌గా ఉంటారని, కోపం వస్తే కొడతారని, కోపం ఆపుకోలేక చేయి చేసుకుంటారని ఒక టాక్ ఉంది. కానీ, ఆయన్నే షూటింగ్ సెట్‌లో అందరి ముందూ కొట్టిన వారు ఇద్దరున్నారు. వారు ఎవరో కాదు.. ఇద్దరు డైరెక్టర్లు కాగా, ఒకరు నందమూరి తారకరామారావు, మరొకరు కోడి రామకృష్ణ. అన్నదమ్ముల అనుబంధం సినిమా తీసే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ చంద్రమోహన్ ను ఒక పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే అనుకోకుండా చంద్రమోహన్ ను తప్పించి బాలకృష్ణను తీసుకున్నారు. బాలయ్యకు పెద్దయిన తర్వాత అదే మొదటి సినిమా. అంతకుముందు తాతమ్మకలలో నటించారు.
చెంపపై గట్టిగా రెండిచ్చిన ఎన్టీఆర్
షూటింగ్ కు ముందే నటనలో ఉండే మెళకువలన్నీ ఎన్టీఆర్ బాలయ్యకు నేర్పించారు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత తడబడుతుండటంతో ఎన్టీఆర్ లాగిపెట్టి రెండిచ్చారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఎస్.డి.లాల్. అలా కొట్టడంతో అందరూ షాక్ తిన్నారు. ఎన్టీఆర్ కూడా అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు కాబట్టి బాలయ్యను కొట్టిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలయ్యను కొట్టిన మరో డైరెక్టర్ కోడి రామకృష్ణ.వీరిద్దరి కాంబినేషన్‌లో 'మంగమ్మగారి మనవడు' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక కీలకమైన సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. ఆ సన్నివేశంలో బాలకృష్ణ సరిగ్గా నటించడంలేదని కోడి రామకృష్ణ భావించారు. ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నా దర్శకుడు కోరుకున్న హావభావాలు రాకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది.

లాగిపెట్టి ఒకటి పీకిన కోడి రామకృష్ణ
షూటింగ్ స్పాట్‌లోనే అందరూ చూస్తుండగానే కోడి రామకృష్ణ బాలయ్య దగ్గరికి వెళ్లి లాగిపెట్టి ఒక చెంప దెబ్బ ఇచ్చారు. ఒక పెద్ద స్టార్ హీరోని, పైగా ఎన్టీఆర్ కుమారుడిని అలా కొట్టేసరికి యూనిట్ సభ్యులంతా షాక్ అయ్యారు. సాధారణంగా ఎవరైనా అలా చేస్తే బాలయ్య ఊరుకోరు. కానీ ఆ సమయంలో ఆయన ఏమాత్రం కోప్పడలేదు. ఎందుకంటే కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తారు. తనను కొట్టింది తన మేలుకోసమేనని అర్థం చేసుకున్నారు. ఆ దెబ్బ తర్వాతే బాలయ్యలో కలిసి పెరిగి ఆ సన్నివేశంలో అద్భుతంగా నటించి పండించారు. 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలయ్యకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. కోడి రామకృష్ణకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎన్నో సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్లుగా నిలిచి అభిమానులను అలరించాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications