బాలకృష్ణకు ఇష్టమైన ఈతరం స్టార్ హీరో ఎవరో తెలుసా?
నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు ప్రస్తుతం ఏ స్టార్ హీరోకు, యువ హీరోలకు కూడా లేదు. కుర్ర డైరెక్టర్లతో వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఘనవిజయాలను సొంతం చేసుకుంటున్నారు. తన తరం హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునకంటే ఎంతో ముందుకు దూసుకుపోతున్నారు. అలాగే బాలయ్య చేస్తున్నంత వేగంగా ప్రస్తుత యువ హీరోలు కూడా సినిమాలు చేయలేకపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి మంచి జోరుమీదున్న బాలయ్య బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేసే అవకాశం ఉంది.
అలాగే ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు. ఈ షో చేయకముందు బాలకృష్ణ వేరు.. చేసిన తర్వాత బాలకృష్ణకు వచ్చిన ఇమేజ్ వేరు. అప్పటివరకు ఆయనంటే వ్యతిరేక భావం కలిగివున్నవారు కూడా ఆ షో చూసి, బాలయ్య మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత అభిమానులుగా మారిపోయారు. తెలుగు సీమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న బాలకృష్ణకు అభిమాన హీరోలు కూడా ఉంటారు. తన తండ్రి ఎన్టీఆర్ ఎంతటి మహానటుడో తెలిసిందే. అలా కాకుండా ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ తరంలో బాలయ్యకు ఇష్టమైన స్టార్ హీరో మహేష్ బాబు. అన్ స్టాపబుల్ షోలోనే జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.

తనకు మహేష్ బాబు నటన అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్లుకానీ, హీరోలుకానీ మహేష్ బాబునే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చాలామంది దర్శకులకు ఆయన ఫేవరెట్ హీరో. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే జర్మనీకి వెళ్లి మేకోవర్ విషయంలో శిక్షణ తీసుకొని వచ్చారు.












Click it and Unblock the Notifications