చిరు, నాగ్, వెంకీలో బాలయ్యకు ఇష్టమైన హీరో

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్-4ను ప్రారంభించారు. కార్యక్రమం సూపర్ హిట్ అయింది. సెలబ్రిటీలంతా అతిథులుగా వస్తున్నారు.. బాలయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్నారు. పేరు ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 110వ సినిమా చేస్తున్నారు. కొత్త కథతో చేస్తున్నారా? లేదంటే అఖండ-2 చేస్తున్నారా? అనే విషయంలో స్పష్టత రాలేదు.

లెజండరీ అవార్డుతో సత్కారం
బాలయ్యకు సమకాలికులైన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్. ఇటీవలే బాలయ్య దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొన్నారు. ఆ అవార్డుల్లో బాలయ్యకు లెజండరీ అవార్డును బహుకరించారు. తన తండ్రి తారకరామారావువల్లే ఈ అవార్డు సాధ్యమైందని బాలయ్య చెప్పారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కు, బాలయ్యకు మధ్య చిట్ చాట్ జరిగింది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ బాలయ్యను చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరంటూ ప్రశ్నించారు. దీనికి బాలయ్య చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.

nandamuri balakrishna favourite hero in chiranjeevi and nagarajuna and venkatesh

నవ్వేసిన కరణ్ జోహార్
వెంటనే మైక్ తీసుకొని హిందీలో మీకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లో ఇష్టమైన హీరో ఎవరంటూ అడిగారు. దీంతో కరణ్ నవ్వేశారు. ఇరువైపుల నుంచి రెండు ప్రశ్నలకు సమాధానం రాలేదు. అలా తెలివిగా బాలయ్య సమాధానం ఇచ్చారు. వాస్తవానికి బాలయ్యతోపాటు అగ్ర కథానాయకులుగా చిరు, నాగ్, వెంకీలు రాణిస్తున్నారు. ప్రస్తుతం యువత వచ్చేసింది. వారిలో కొందరు స్టార్ హీరోలుగా మారిపోయారు. చిరు, నాగ్ వారసులు రంగప్రవేశం చేశారు. బాలయ్య తనయుడు త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఇక మిగిలింది వెంకటేష్ కొడుకు వంతే. అతని పేరు అర్జున్. అతన్ని కూడా సినిమాల్లో తీసుకువస్తారేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+