బాలయ్య మూవీకి నేషనల్ అవార్డ్.. ఇంకా ఎవరెవరికి అంటే ?

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం ‍అవార్డులను ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ విజేతల వివరాలను వెల్లడించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్‌ కేసరి' నిలిచింది. దీంతో ఆయన అభిమానులు 'జై బాలయ్య' అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా '12th ఫెయిల్‌' సినిమాకు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌).. విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ - మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ) మూవీలో నటనకు అవార్డు వరించింది.

nandamuri-balakrishna-film-bhagavanth-kesari-got-national-award

అలాగే ఉత్తమ యాక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ)లో 'హను-మాన్‌' చిత్రం అవార్డు దక్కించుకోగా.. ఉత్తమ గేయ రచయితగా 'బలగం'లో 'ఊరు పల్లెటూరు' పాటకు గానూ కాసర్ల శ్యామ్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుక్రుతి.. గాంధీతాత చెట్టు మూవీ నుంచి ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా 'పార్కింగ్‌'కు అవార్డు దక్కింది.

జాతీయ అవార్డుల లిస్ట్..

నటన విభాగం..

ఉత్తమ నటి - మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ) రాణీ ముఖర్జీ

ఉత్తమ నటుడు - జవాన్‌ (హిందీ) షారుక్‌ ఖాన్‌, 12th ఫెయిల్‌ (హిందీ) విక్రాంత్‌ మస్సే

ఉత్తమ సహాయ నటి - ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్‌ (గుజరాతీ) జానకీ బోడివాలా

ఉత్తమ సహాయ నటుడు - పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్‌, పార్కింగ్‌ (తమిళ్‌) ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్

సంగీత విభాగం..

ఉత్తమ మ్యూజిక్‌ దర్శకత్వం - వాతి (తమిళ్‌) జీవీ ప్రకాశ్‌ కుమార్

ఉత్తమ నేపథ్య సంగీతం - యానిమల్ - హర్షవర్థన్‌ రామేశ్వర్

ఉత్తమ నేపథ్య గాయని - జవాన్‌ (చెలియా) శిల్పారావు

ఉత్తమ నేపథ్య గాయకుడు - బేబీ - పీవీన్‌ ఎస్‌ రోహిత్

సాంకేతిక విభాగాలు..

ఉత్తమ మేకప్‌ - సామ్‌ బహూదర్‌ (హిందీ) శ్రీకాంత్‌ దేశాయ్

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - సామ్‌ బహదూర్‌ (హిందీ)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - 2018 - ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో (మలయాళం) మోహన్‌దాస్‌

ఉత్తమ ఎడిటింగ్‌ - పూక్కాలమ్‌ (మలయాళం) మిధున్‌ మురళి

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ - యానిమల్‌ (హిందీ) సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీధరన్

ఉత్తమ సినిమాటోగ్రఫీ - ది కేరళ స్టోరీ (హిందీ) పసంతను మొహపాత్రో

రచన విభాగం..

ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) - బేబీ (తెలుగు) సాయి రాజేశ్‌ నీలం

ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) - పార్కింగ్‌ (తమిళ్‌) రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌

ఉత్తమ సంభాషణలు - సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (హిందీ) దీపక్‌ కింగ్రానీ

ఇతర విభాగాలు..

ఉత్తమ దర్శకత్వం - ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్

ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ - హనుమాన్‌ (తెలుగు)

ఉత్తమ బాలల చిత్రం - నాల్‌ (మరాఠీ)

ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం - సామ్‌ బహదూర్‌ (హిందీ)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం - రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ (హిందీ)

బాల నటులు..

గాంధీతాత చెట్టు - సుకృతివేణి

జిప్సీ (మరాఠీ) - కబీర్‌ ఖండారీ

నాల్‌ 2 (మరాఠీ) - త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ విభాగం..

ఉత్తమ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - ఫ్లవరింగ్‌ మ్యాన్‌ (హిందీ)

ఉత్తమ పరిచయ దర్శకుడు - మావ్‌ - ది స్పిరిట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ చెరా (మిజో)

ఉత్తమ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్‌ - మా బావు, మా గావ్‌ (ఒడిశా), లెంటినో ఓవో - ఏ లైట్‌ ఆన్‌ ది ఈస్ట్రన్‌ హారిజన్‌ (ఇంగ్లీష్)

ఉత్తమ ఆర్ట్స్‌/కల్చర్‌ ఫిల్మ్‌ - టైమ్‌లెస్‌ తమిళనాడు (ఇంగ్లీష్)

ఉత్తమ డైరెక్షన్‌ - ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)

ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్షన్‌ - ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)

ఉత్తమ ఎడిటింగ్‌ - మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్)

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ - దుందగిరి కే ఫూల్‌ (హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్)

ఉత్తమ స్క్రిప్ట్‌ - సన్‌ ఫ్లవర్స్‌ వోర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో (కన్నడ)

ఉత్తమ వాయిస్‌ ఓవర్‌ - ది సేక్రెడ్‌ జాక్‌ - ఎక్స్‌ప్లోరింగ్‌ ది ట్రీస్‌ ఆఫ్‌ విషెస్‌ (ఇంగ్లీష్)

స్పెషల్‌ మెన్షన్‌ చిత్రాలు..

నేకల్‌ - క్రానికల్‌ ఆఫ్‌ ప్యాడీ మ్యాన్‌ (మలయాళం)

ది సీ అండ్‌ సెవెన్‌ విలెజెస్‌ (ఒడియా)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+