ఆ పాత్రతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనాన్ని సృష్టించబోతున్న బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కొలి బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా వరుసగా మూడుసార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంచి జోరుమీద ఉన్నారు. అటువంటి బాలయ్య తనకు మరో ఇమేజ్ ను తీసుకువచ్చిన అన్ స్టాపబుల్ షో మూడో సీజన్ ను కూడా త్వరలోనే మన ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. అనేక విషయాలను బహిరంగంగానే చెప్పినట్లు తెలుస్తోంది.
రేపు అధికారికంగా ప్రకటన రాబోతోంది?
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో బాలయ్య సూపర్ హీరోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదికనుక నిజమైతే తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య సంచలనం సృష్టించినవారవుతారని సినీ విశ్లేషకులు అంటున్నారు. రేపు దీనికి సంబంధించి అధికారికంగా ఓ ప్రకటన రాబోతోంది. అలాగే సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఎప్పుడు పాటలు విడుదలవుతాయనే విషయాన్ని మొత్తం వివరించనున్నారు. దీనికోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ నిడివి ఉన్న పాత్ర
తెలుగు సినీ పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ సూపర్ హీరో పాత్ర పోషించలేదని చెప్పొచ్చు. పాటల్లోనో, కొన్ని సన్నివేశాల్లోనే ఒకటి, రెండు నిముషాలు చేసివుంటారేమోకానీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర మాత్రం ఎవరూ చేయలేదు. అది ఇప్పుడు బాలయ్య చేశారని సమాచారం. 60 సంవత్సరాల వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా, వారికి పోటీనిస్తూ వరుసగా అఖండ విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను కూడా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమాతోనే తన కొడుకును స్టార్ హీరోగా మార్చాలనే యోచనలో బాలయ్య ఉన్నారు. అందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు నందమూరి అభిమానుల తోడ్పాటు కూడా అందుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications